GSLV: జీఎస్ఎల్వీ కౌంట్ డౌన్ ప్రారంభం.. దేశ రక్షణ వ్యవస్థకు, విపత్తుల నిర్వహణకు ఉపకరించనున్న శాటిలైట్

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌ నుంచి జియోసింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(జీఎస్‌ఎల్‌వీ)-ఎఫ్‌10 వాహకనౌక ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌ డౌన్‌ మొదలైంది.

GSLV: జీఎస్ఎల్వీ కౌంట్ డౌన్ ప్రారంభం.. దేశ రక్షణ వ్యవస్థకు, విపత్తుల నిర్వహణకు ఉపకరించనున్న శాటిలైట్
Gslv Countdown Statrs At Shar

Updated on: Aug 11, 2021 | 9:09 AM

GSLV Countdown Begins: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్‌ నుంచి జియోసింక్రోనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌(జీఎస్‌ఎల్‌వీ)-ఎఫ్‌10 వాహకనౌక ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌ డౌన్‌ బుధవారం తెల్లవారుజామున 3.43 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 26 గంటల పాటు కొనసాగిన తర్వాత గురువారం ఉదయం 5.43 గంటలకు జీఎస్‌ఎల్‌వీ వాహకనౌక నింగిలోనికి దూసుకెళ్లనుంది. దీని ద్వారా 2,268 కిలోల బరువు ఉన్న జీఐశాట్‌-1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశ పెట్టనున్నారు. ఉపగ్రహం ద్వారా దేశ రక్షణ వ్యవస్థకు, విపత్తుల నిర్వహణకు ఉపకరించే భూ పరిశీలన అంశాలను తెలుసుకునే వీలుంది.

భూపరిశీలన నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్- F10 (GSLV-F10) పేరుతో ఈ శాటిలైట్‌ను నింగిలోకి పంపనుంది. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ కేంద్రం రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగిస్తున్నారు. EOS-03 అనేది అత్యాధునిక చురుకైన ఉపగ్రహం, దీనిని GSLV-F10 ద్వారా జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లో ఉంచుతారు. తదనంతరం, ఉపగ్రహం దాని ఆన్‌బోర్డ్ ప్రొపల్షన్ సిస్టమ్‌ని ఉపయోగించి తుది జియోస్టేషనరీ కక్ష్యకు చేరుకుంటుంది. ఈ GSLV వాహననౌకలో మొదటిసారిగా ఫెయిరింగ్ కోసం నాలుగు మీటర్ల వ్యాసం కలిగిన ఓగివ్ ఆకారపు పేలోడ్ ఫెయిరింగ్ ఎగురుతోంది. ఇది జిఎస్‌ఎల్‌వి యొక్క పద్నాలుగో వాహక నౌక కావడం గమనార్హం.

Read Also…  తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలకు చెక్ పెట్టేందుకు కేఆర్ఎంబీ ప్రయత్నం.. ఇవాళ పోతిరెడ్డిపాడును పరిశీలించనున్న సభ్యులు