Google Chrome, Microsoft: మీరు గూగుల్‌ క్రోమ్‌, మైక్రోసాఫ్ట్ వాడుతున్నారా..? అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం హెచ్చరిక

|

Mar 22, 2022 | 9:38 AM

Google Chrome, Microsoft: గూగుల్‌ క్రోమ్‌, మైక్రోసాఫ్ట్‌ వాడేవారు చాలా మంది ఉంటారు. వీటిని వాడేవారికి కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ కిందకు వచ్చే ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ..

Google Chrome, Microsoft: మీరు గూగుల్‌ క్రోమ్‌, మైక్రోసాఫ్ట్ వాడుతున్నారా..? అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం హెచ్చరిక
Follow us on

Google Chrome, Microsoft: గూగుల్‌ క్రోమ్‌, మైక్రోసాఫ్ట్‌ వాడేవారు చాలా మంది ఉంటారు. వీటిని వాడేవారికి కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ కిందకు వచ్చే ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం (CERT-In) హెచ్చరిక జారీ చేసింది. గూగుల్‌ క్రోమ్‌ (Google Chrome), మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ Microsoft Edge) బ్రౌజర్‌లను వాడేవారిని అప్రమత్తం చేసింది. ఇందులో పలు లోపాలున్నట్లు గుర్తించింది. గూగుల్‌ క్రోమ్‌ 99.0.4844.74 వెర్షన్‌ కంటే ముందు బ్రౌజర్‌ను వాడుతున్నవారికి ప్రమాదం ఉందని హెచ్చరించింది. గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్స్‌ (Google Browsers)ను వాడే యూజర్ల డేటాను హ్యాకర్లు సులభంగా హ్యాక్‌ చేసే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఆయా బ్లింక్‌ లేఅవుట్‌, ఎక్స్‌టెన్షన్స్‌, సేఫ్‌ బ్రౌజింగ్‌, స్ప్లీట్‌ స్క్రీన్‌, అంగిల్‌, న్యూ ట్యాబ్‌ పేజీ, బ్రౌజర్‌ యూపీ, జీపీయూలో హీప్‌ బఫర్‌ ఓవర్‌ఫ్లో వంటి లోపాలున్నట్లు తెలిపింది.

గూగుల్‌ క్రోమ్‌తో పాటు మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ బ్రౌజర్‌లో కూడా భద్రతా లోపాటున్నట్లు ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీం సూచించింది. మైక్రో సాఫ్ట్‌ ఎడ్జ్‌ వాడే యూజర్ల డేటాను హ్యాకర్లు సులభంగా పొందవచ్చని హెచ్చరించింది. మైక్రో సాఫ్ట్‌ ఎడ్జ్‌ యూజర్లు వెంటనే తమ బ్రౌజర్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించింది. లేకపోతే ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని రోజుల కిందట యాపిల్‌ ఉత్పత్తులపై కూడా కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి:

Brain Tunnels: మెదడులో ‘రహస్య సొరంగాలు’.. పరిశోధనల ద్వారా గుర్తించిన శాస్త్రవేత్తలు

Clouds: కొన్ని మేఘాలు నల్లగా ఎందుకు ఉంటాయి..? కారణాలు తెలుసుకోండి..!