Google AI Tools For Journalist: జర్నలిస్టులకు టెక్ దిగ్గజం గూగుల్ గుడ్‌న్యూస్ చెప్పింది. జర్నలిజం నిపుణుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌పై పని జరుగుతోందని పేర్కొంది. జర్నలిస్టుల కోసం ఏఐ టూల్స్ ప్రాజెక్ట్ పని ప్రాథమిక దశలో ఉందని కంపెనీ తెలిపింది. జర్నలిస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ సహాయంతో.. జర్నలిస్టులు మెరుగైన కథనాలు, హెడ్డింగ్‌లతో సహా ఇతర సాంకేతిక అవసరాలను తీర్చగలుగుతారని వెల్లడించింది. మీడియా నివేదికల ప్రకారం, గూగుల్ ప్రతినిధులు దీనికి సంబంధించి గూగుల్ నుంచి సమాచారం, సూచనల కోసం గ్లోబల్ మీడియా పరిశ్రమతో అనుబంధించబడిన యజమానులు, ఎడిటర్‌లు, జర్నలిస్టులతో మాట్లాడుతున్నారు.
ది న్యూయార్క్ టైమ్స్, ది వాషింగ్టన్ పోస్ట్, న్యూ కార్ప్, ది వాల్ స్ట్రీట్ జనర్నల్ యజమానులకు గూగుల్ జర్నలిస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఎలా ఉంటాయి. అది ఎలా పని చేస్తుందనే దాని గురించి గూగుల్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. ఈ సాధనాల సహాయంతో తయారు చేయబడిన వార్తలు/నివేదికలు ఎలా .. ఏ మేరకు వాస్తవికత, ప్రామాణికతపై నిలుస్తాయనే అంశంను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు.
గూగుల్ జర్నలిస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ పై వచ్చిన వార్తల తర్వాత.. మీడియా పరిశ్రమలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో పాటు ఇప్పటికే ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉన్న టెక్నాలజీ ఆధారిత జర్నలిజం వల్ల పరిశ్రమతో అనుబంధం ఉన్న జర్నలిస్టులు ఉపాధి కోల్పోవాల్సి వస్తుందా..? అనే ప్రశ్న తలెత్తుతోంది.
జర్నలిస్టులు తాము అందించే స్టోరీ రైటింగ్‌కు మెరుగైన హెడ్డింగ్‌లు, కంటెంట్‌ను సిద్ధం చేయడమే AI సాధనాల ఉద్దేశ్యం అని గూగుల్ తెలిపింది. తమ ముఖ్య ఉద్దేశ్యం జర్నలిస్టులను రిపోర్టింగ్, న్యూస్ రైటింగ్, ఫ్యాక్ట్ చెకింగ్ వంటి పని నుంచి పక్కకు తప్పించడం కాదని.. జర్నలిస్టుల పనిని సులభతరం చేయడమే తమ లక్ష్యం అని గూగుల్ వివరణ కూడా ఇచ్చుకుంది.
ఉదాహరణతో వివరించే ప్రయత్నం చేసింది గూగుల్.. ఒక రిపోర్టర్ క్రీడలపై నివేదికను సిద్ధం చేస్తుంటే.. అందులో క్రీడలకు సంబంధించిన వ్యాపార డేటా అవసరమైతే.. గూగుల్ జర్నలిస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ సాధారణ భాషలో, ఆసక్తికరమైన ఫార్మాట్‌లో ఒకే క్లిక్‌లో క్రీడల నుంచి కార్పొరేట్ ఆదాయాలకు సంబంధించిన గణాంకాలను అందిస్తాయి.
ఒకే డేటా ఏకకాలంలో బహుళ ఫార్మాట్లలో అందుబాటులో ఉంటుంది. అనేక టెక్ AI ఆధారిత టెక్నాలజీ కంపెనీలు సామాన్యుల రచనా శైలిలో AI రూపొందించిన కంటెంట్‌పై నిరంతరం పని చేస్తున్నాయి. లేటెస్ట్ రైటింగ్ టూల్స్ కోసం ఎన్నో టెక్ కంపెనీలు కోట్లకు కోట్లు వెచ్చించి నిరంతర పరిశోధనలు చేస్తున్నాయి. ఇటీవల, ప్రపంచంలోని ప్రముఖ వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ (AP), ChatGPT-మేకర్ ఓపెన్ AI మధ్య 1985కి ముందు వార్తలకు లైసెన్స్ ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది. ఈ డీల్ ఎంత మొత్తానికి సంబంధించిన సమాచారం వెల్లడించలేదు.
మరిన్ని టెక్నాలజీ న్యూస్ కోసం