ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఉండడం సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా గతంలో సాంప్రదాయ టీవీలు కాకుండా స్మార్ట్ టీవీల యుగం నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ స్మార్ట్ టీవీలకు ఉపయోగపడేలా కొన్ని కంపెనీలు ప్రత్యేక ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ సంస్థ గూగుల్ ప్రత్యేక స్ట్రీమింగ్ పరికరాన్ని ప్రారంభించింది. గూగుల్ టీవీ స్ట్రీమర్‌గా పిలిచే ఈ డివైజ్ క్రోమ్ కాస్ట్ లైన్‌ను భర్తీ చేసేలా రూపొందించారని టెక్ నిపుణులు చెబుతున్నారు. అయితే క్రోమ్ కాస్ట్ మాదిరిగా చిన్న డాంగిల్ ఫారమ్ ఫ్యాక్టర్‌లా కాకుండా టీవీ స్ట్రీమర్ సాంప్రదాయ సెట్-టాప్-బాక్స్ డిజైన్‌తో వస్తుంది. గూగుల్ తన తాజా స్ట్రీమింగ్ పరికరం మరింత పనితీరును అందిస్తుందని, డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్‌తో 4కే హెచ్‌డిఆర్‌కు మద్దతు ఇస్తుందని తెలిపింది. ఈ నేపథ్యంలో గూగుల్ రిలీజ్ చేసిన స్ట్రీమింగ్ పరికరం గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
గూగుల్ టీవీ స్ట్రీమర్ ప్రస్తుతం యూఎస్ మార్కెట్‌లో ప్రత్యేకంగా ప్రీఆర్డర్‌ల కోసం అందుబాటులో ఉంది. ఈ స్ట్రీమర్ ధరను 99.99 డాలర్లుగా నిర్ణయంగా, సెప్టెంబర్ 24 నుంచి కస్టమర్లకు అందుబాటులోకి వస్తుంది. గూగుల్ టీవీ స్ట్రీమర్ సూపర్ స్టైలిష్ డిజైన్‌తో రూపొందించారు. ముఖ్యంగా టీవీ స్ట్రీమర్‌తో వచ్చే వాయిస్ రిమోట్‌ను కూడా రీడిజైన్ చేశారు. కొత్త రిమోట్ అన్ని వయస్సుల వారికి అనుకూలమైన కొత్త బటన్ లేఅవుట్‌తో మెరుగైన ఎర్గోనామిక్స్‌తో వస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే స్మార్ట్ ఫోన్ ద్వారా గూగుల్ టీవీ స్ట్రీమర్‌ను కంట్రోల్ చేసేలా ప్రత్యేక యాప్ రూపొందిస్తున్నట్లు తెలిపింది. యూట్యూబ్ టీవీ, నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, యాపిల్ టీవీ తదితర స్ట్రీమింగ్ యాప్‌ల ద్వారా టీవీ స్ట్రీమర్ 7,00,000కు పైగా సినిమాలు, షోలకు యాక్సెస్‌ను అందిస్తుందని గూగుల్ తెలిపింది.
వినియోగదారుల ప్రాధాన్యతల ఆధారంగా యాప్ సబ్‌స్క్రిప్షన్‌లలో కంటెంట్ సూచనలను క్యూరేట్ చేయడానికి గూగుల్ టీవీ స్ట్రీమర్ గూగుల్ ఏఐను ఉపయోగిస్తుంది. అదనంగా గూగుల్ టీవీలో గూగుల్ జెమినీతో వినియోగదారులు కంటెంట్‌కు సంబంధించిన సారాంశాలు, సమీక్షల వంటివి అడగవచ్చు. యాంబియంట్ మోడ్‌లో ఉత్పాదక ఏఐ సామర్థ్యాలను ఉపయోగించి ఇండివిడ్యువల్ స్క్రీన్‌సేవర్ ఆర్ట్‌ని సృష్టించే ఎంపిక కూడా ఉంది. స్క్రీన్‌సేవర్‌ను రూపొందించడానికి ఫీచర్ కోసం వాయిస్‌ని ఉపయోగించి వినియోగదారులు తమ ప్రాంప్ట్‌ను ఇన్‌పుట్ చేయవచ్చు. కొత్త ఫారమ్ ఫ్యాక్టర్‌ని ఉపయోగించి గూగుల్ తన స్ట్రీమింగ్ పరికరం పనితీరును కూడా మెరుగుపరిచింది. గూగుల్ టీవీ స్ట్రీమర్ మెరుగైన ప్రాసెసర్‌తో వస్తుంది అలాగే గత క్రోమ్ కాస్ట్ పరికరం కంటే రెట్టింపు ర్యామ్‌తో వస్తుంది. గూగుల్ స్ట్రీమర్ డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్‌తో 4కే హెచ్‌డీఆర్‌కు మద్దతు ఇస్తుంది. గూగుల్ టీవీ స్ట్రీమర్‌తో వినియోగదారులు వైఫైతో పాటు ఈథర్‌నెట్ పోర్ట్‌ని ఉపయోగించవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..