“గూగుల్ పే” యూజర్స్‌కి గుడ్ న్యూస్..

| Edited By:

Jan 28, 2020 | 2:34 PM

డిజిటల్ లావాదేవీల మొబైల్ యాప్ “గూగుల్ పే” వినియోగదారులకు మరో సర్వీసును కూడా తీసుకొచ్చింది. కార్లు ఉన్న యూజర్సందరికీ ఇప్పుడు ఫాస్టాగ్ తప్పనిసరి అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కారు ఉన్న వినియోగదారుల కోసం.. గూగుల్ పే రిచార్జ్ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులు తమ ఫాస్టాగ్‌ ఖాతాను ఈజీగా రీఛార్జ్‌ చేసుకునేలా.. ప్రత్యేక యూపీఐ సౌకర్యాన్ని “గుగూల్ పే” యాప్‌ ద్వారా ప్రారంభించింది. దీనికి సంబంధించి సోమవారం ఓ ప్రకటన చేసింది. గూగుల్‌పేకు ఫాస్టాగ్‌ […]

గూగుల్ పే యూజర్స్‌కి గుడ్ న్యూస్..
Follow us on

డిజిటల్ లావాదేవీల మొబైల్ యాప్ “గూగుల్ పే” వినియోగదారులకు మరో సర్వీసును కూడా తీసుకొచ్చింది. కార్లు ఉన్న యూజర్సందరికీ ఇప్పుడు ఫాస్టాగ్ తప్పనిసరి అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కారు ఉన్న వినియోగదారుల కోసం.. గూగుల్ పే రిచార్జ్ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది.

వినియోగదారులు తమ ఫాస్టాగ్‌ ఖాతాను ఈజీగా రీఛార్జ్‌ చేసుకునేలా.. ప్రత్యేక యూపీఐ సౌకర్యాన్ని “గుగూల్ పే” యాప్‌ ద్వారా ప్రారంభించింది. దీనికి సంబంధించి సోమవారం ఓ ప్రకటన చేసింది. గూగుల్‌పేకు ఫాస్టాగ్‌ ఖాతాను లింక్‌ చేసుకుని రీఛార్జ్‌ చేసుకోవడమే కాకుండా, అందులో ఉన్న బ్యాలెన్స్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే సదుపాయం కూడా ఉన్నట్లు తెలిపింది. ఈ యాప్ ద్వారా ఫాస్టాగ్‌ రీఛార్జ్‌ చేసుకోవాలనుకునే కస్టమర్లు.. గూగుల్ పే యాప్‌లోకి వెళ్లిన తర్వాత.. బిల్‌ పేమెంట్స్‌ ఆప్షన్ ఎంచుకోవాలని.. ఆ తర్వాత కింద ఉన్న సెక్షన్‌లలో ఫాస్టాగ్‌ కేటగిరీని ఎంపిక చేసుకోవాలని పేర్కొంది. ఆ తర్వాత మనకు ఫాస్టాగ్‌ జారీ చేసిన బ్యాంకును సెలెక్ట్‌ చేసుకోవాలని.. ఆ తర్వాత వెహికల్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి.. సదరు బ్యాంకు ద్వారా పేమేంట్ కంప్లీట్ చేయవచ్చని సంస్థ తెలిపింది.