Google Meet: నేటి ఆధునిక యుగంలో ఫేస్ టు ఫేస్ మీటింగ్ ల కంటే ఆన్ లైన్ సమావేశాలకే అందరూ అలవాటుపడ్డారు. దీని ద్వారా సమయం ఆదాతో పాటు ఖర్చు తగ్గుతుంది. ఈఆన్ లైన్ మీటింగ్స్ కోసం ఎన్నో యాప్ లు ఉన్నప్పటికి చాలామంది వాడేది గూగ్ ల్ మీట్.. మరి ఈగూగుల్ మీట్ లో కొత్త ఆప్షన్స్, సరికొత్త షార్ట్ కట్ ఒకటి అందుబాటులోకి వస్తోంది. అదేంటో తెలుసుకుందాం. సాధారణంగా ఎక్కువ గూగుల్ మీట్ వాడేవారు ఒక్కోసారి.. అన్‌మ్యూట్ చేసిన తర్వాత.. మళ్లీ మ్యూట్ చేయడం మర్చిపోతూ ఉంటారు. ఎవరూ వినట్లేదు కదా అని.. మనకు నచ్చినది మాట్లాడేస్తూ ఉంటాం. ఇక నుంచి అలాంటి టెన్షన్ అవసరం లేదు. అలాంటి వారి కోసం గూగుల్ కొత్త షార్ట్ కట్ ను అందుబాటులోకి తేనుంది. గూగుల్ తమ వినియోగదారులకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను అందిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా.. గూగుల్ మీట్‌కు కొత్త ‘షార్ట్‌కట్’ రాబొతున్నట్టు తెలుస్తోంది. వీడియో కాల్లో ఉన్నప్పుడు.. అన్‌మ్యూట్ చేసుకునేందుకు ఈ షార్ట్‌కట్ ఉపయోగపడుతుందని టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. కొత్త షార్ట్‌కట్‌తో.. స్పేస్‌బార్ ద్వారా అన్‌మ్యూట్ అవ్వొచ్చు. అవును.. స్పేస్‌బార్‌ని ప్రెస్ చేసి, కొన్ని సెకన్ల పాటు పట్టుకుంటే.. వీడియో అన్‌మ్యూట్ అవుతుంది. స్పేస్‌బార్‌ని వదిలేస్తే.. మళ్లీ మ్యూట్ అయిపోతుంది.మీటింగ్స్‌లో తొందరగా మనల్ని మనం అన్‌మ్యూట్ చేసుకునేందుకు.. స్పేస్‌బార్‌ని పట్టుకోవాలి. స్పేస్‌బార్ వదిలేస్తే మళ్లీ మ్యూట్ అయిపోతుంది.
గూగుల్ మీట్‌కు ఈ కొత్త షార్ట్‌కట్ ఎంతో ఉపయోగకరం అని టెక్నికల్ ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు. అన్‌మ్యూట్ చేసిన తర్వాత.. మ్యూట్ చేయడం మర్చిపోయే సందర్భాల నుంచి తప్పించుకోవాలంటే ఈ షార్ట్‌కట్ పనికొస్తుందని అంటున్నారు. చాలా మంది.. అన్‌మ్యూట్ చేసిన తర్వాత మళ్లీ మ్యూట్ చేయడం మర్చిపోతూ ఉంటారు. మ్యూట్‌లోనే ఉంది అనుకుని.. ఇష్టం వచ్చింది మాట్లాడేసి నాలుక కరుచుకుంటారు. వారందరికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడనుంది. గూగుల్ మీట్లో ఈ కొత్త షార్ట్‌కట్.. సెప్టెంబర్ 9 నుంచి అందుబాటులోకి రానుంది. డీఫాల్ట్‌గానే యాప్‌లోకి వచ్చేస్తుంది. కొత్తగా ఎలాంటి డౌన్లోడ్లు చేసుకోవాల్సిన అవసరం లేదని గూగుల్ సంస్థ తెలిపింది. గూగుల్ మీట్ సెట్టింగ్స్‌లో ఎనేబుల్ చేసుకుంటే చాలు. వర్క్‌స్పేస్ కస్టమర్లు, పర్సనల్ గూగుల్ అకౌంట్స్ ఉన్న వారందరికీ ఈ షార్ట్‌కట్ అందుబాటులో ఉంటుందని గూగుల్ సంస్థ ప్రకటించింది. ఈకొత్త షార్ట్ కట్ తో పాటు గూగుల్ మీట్ లో ఎన్నో సరికొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఇటీవలే సంస్థ తెలిపింది. గూగుల్ డుయో ఫీచర్స్ అన్నింటినీ గూగుల్ మీట్‌లోకి తీసుకొస్తూ.. డుయో, మీట్‌లను సింగిల్ ప్లాట్‌ఫారమ్‌గా విలీనం చేయనున్నారు. గూగుల్ మీట్ యూజర్లకు కేవలం వీడియో కాలింగ్ సదుపాయం ఒక్కటే కాకుండా షెడ్యూలింగ్, జాయినింగ్ మీటింగ్స్, వర్చువల్ బ్యాక్ గ్రౌండ్స్, ఇన్-మీటింగ్ చాటింగ్ వంటి కొత్త సదుపాయాలను అందిస్తున్నట్టు గూగుల్ తెలిపింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం చూడండి..