Google మ్యాప్‌ని ప్రతి ఒక్కరు వినియోగించే ఉంటారు. ఏదైనా తెలియని ప్రదేశానికి వెళ్లాలంటే ఈ గూగుల్ మ్యాప్ సహాయం తీసుకుంటాము. అయితే గూగుల్ మ్యాప్‌లో వినిపించే స్త్రీ స్వరం చాలా మధురంగా ఉంటుంది. ఈ గూగుల్ మ్యాప్‌లో మాట్లాడుతున్న మహిళ ఎవరో తెలుసా? ఆమె పేరు ఏమిటి ? పూర్తి వివరాలు తెలుసుకుందాం. గూగుల్ మ్యాప్‌లో గొంతు వినిపించే మహిళ పేరు కరెన్ జాకబ్‌సెన్. ఆమె పూర్తి పేరు కరెన్ ఎలిజబెత్ జాకబ్సెన్. ఆమె ఆస్ట్రేలియన్ మూలానికి చెందినది. ప్రస్తుతం న్యూయార్క్‌లో నివసిస్తున్నారు. కరెన్ ఒక వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్. సింగర్, కంపోజర్, వృత్తి రీత్యా ప్రభావశీలి. కరెన్ ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ద్వారా ప్రపంచంలోని కోట్లాది మందికి ఆమె వాయిస్ చేరువైంది. అదనంగా, కరెన్ జాకబ్‌సెన్ వాయిస్ 2011 నుండి 2014 వరకు Apple iPhoneలు, iPodలు, iPadలలో సిరి అప్లికేషన్‌లో ఉపయోగించారు.
ఈ మహిళా ఎంటర్‌టైనర్‌గా, అనేక షోలను అందించారు. ఇందులో ది ట్రయాడ్, ది లారీ బీచ్‌మన్ థియేటర్, పబ్లిక్ థియేటర్, ది డ్యూప్లెక్స్, ది బిట్టర్ ఎండ్ ఉన్నాయి. జాకబ్‌సెన్ రెండు పుస్తకాలు కూడా రాశారట. రీకాలిక్యులేట్ అని పేరు పెట్టారు. అవి డ్రైవింగ్ పనితీరు విజయానికి దిశలు, మీ భవిష్యత్తు కోసం జీపీఎస్ గర్ల్స్ రోడ్ మ్యాప్ వంటివి ఉన్నాయి. కరెన్ డాసన్స్ క్రీక్ కోసం సౌండ్‌ట్రాక్‌ను కూడా కంపోజ్ చేశారట.
ఆస్ట్రేలియన్ యాస వినడానికి..
ఆస్ట్రేలియన్ యాస వినడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి వారు నా వాయిస్‌ని ఎంచుకున్నారని ఆమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. నా వాయిస్ ఒక బిలియన్ జీపీఎస్, స్మార్ట్‌ఫోన్‌లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యక్తులకు మార్గనిర్దేశం చేస్తోంది. మీరు మీ గమ్యాన్ని చేరుకునే మార్గాలను చెబుతాను అని జాకబ్‌సెన్ నవ్వుతూ చెబుతున్నారు.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి