Google Maps: టోల్‌ ప్లాజాను తప్పించుకోవాలనుకుంటున్నారా.? గూగుల్‌ మ్యాప్స్‌ తెస్తున్న ఈ కొత్త ఫీచర్‌ మీకోసమే..

|

Apr 07, 2022 | 9:51 AM

Google Maps: ఒకప్పుడు ఏదైనా అడ్రస్‌ తెలుసుకోవాలంటే అందుబాటులో ఉన్న వారిని అడుగుతూ వెళ్లేవారు. కానీ గూగుల్‌ మ్యాప్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ (SmartPhone) ఉంటే చాలు ఎవరినీ...

Google Maps: టోల్‌ ప్లాజాను తప్పించుకోవాలనుకుంటున్నారా.? గూగుల్‌ మ్యాప్స్‌ తెస్తున్న ఈ కొత్త ఫీచర్‌ మీకోసమే..
Google Maps
Follow us on

Google Maps: ఒకప్పుడు ఏదైనా అడ్రస్‌ తెలుసుకోవాలంటే అందుబాటులో ఉన్న వారిని అడుగుతూ వెళ్లేవారు. కానీ గూగుల్‌ మ్యాప్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ (SmartPhone) ఉంటే చాలు ఎవరినీ అడగాల్సిన పనిలేకుండా గమ్యాన్ని చేరుకుంటున్నారు. దీంతో కాలు బయటపెడితే చాలు మ్యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారు చాలా మంది. గూగుల్‌ (Google) కూడా వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. మారుతోన్న అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది.

మనం వెళ్లే రూట్‌ను సెలక్ట్‌ చేసుకోగానే సదరు దారిలో ఉన్న టోల్‌ ప్లాజాల వివరాలను తెలుపుతుంది. అంతేకాకుండా మీ గమ్యానికి చేరుకునే లోపు ఎంత టోల్‌ ఛార్జి పడుతుందన్న వివరాలను అందిస్తుంది. దీంతో ముందుగానే టోల్‌ ప్లాజాల్లో కట్టే మొత్తం ఎంతో తెలుసుకొని, దానికి అనుగుణంగా ఫాస్టాగ్‌ రీఛార్జ్‌ చేసుకోవచ్చు. ఇదే కాకుండా టోల్‌ ప్లాజాలను తప్పించుకునేందుకు వీలున్న మార్గాలను సైతం గూగుల్‌ చూపిస్తుంది. టోల్‌ చెల్లించకుండా గమ్యాన్ని చేరుకునే మార్గాలను మ్యాప్స్‌ అందిస్తుంది. మ్యాప్స్‌లో ఉండే ‘అవైడ్ టోల్స్‌’ అనే ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా యూజర్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు.

ఇదిలా ఉంటే వీటితో పాటు గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా నావిగేషన్‌ను యాపిల్‌ వాచ్‌లోనూ అందుబాటులోకి తీసుకురానుంది. సిరి వాయిస్‌ అసిస్టెంట్ సహాయంతో నేరుగా గూగుల్‌ మ్యాప్స్‌ నావిగేషన్‌ను తీసుకురానున్నారు. ఈ సరికొత్త అప్‌డేట్స్‌ను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ కొత్త ఫీచర్లను పొందాలంటే యూజర్లు మ్యాప్స్‌ లేటెస్ట్‌ వెర్షన్‌కి అప్‌డేట్‌ కావాల్సి ఉంటుంది.

Also Read: AP: ఏపీలో కరెంట్ కోతల కల్లోలం.. ఆస్పత్రుల్లో దారుణ పరిస్థితులు.. నరకం చూస్తున్న రోగులు

World Health Day 2022: ప్రభుత్వ చౌకైన ఆరోగ్య సేవలు.. పేద,మధ్యతరగతి ప్రజల పొదుపును పెంచాయిః ప్రధాని నరేంద్ర మోదీ

Sri Lanka: శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం.. ఒక్క భారత రూపాయి విలువ అక్కడెంతో తెలుసా..?