Kids Photos In Google: ఒకసారి గూగుల్ సెర్చ్‌లో మీ పూర్తి పేరును టైప్ చేసి చూడండి.. మీకు సంబంధించిన ఏదో ఒక ఫొటో వస్తుంది. ఇలా ఆన్‌లైన్‌లో మీ ఫొటోలు ప్రత్యక్షమైతే ఎంతైనా ఇబ్బందేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీటిని తప్పుడు పనులకు ఉపయోగించే ప్రమాదం కచ్చితంగా ఉంటుంది. అయితే గూగుల్‌లో మన ఫొటోలు రావడానికి పలు రకాల కారణాలున్నాయి. వాటిలో కొన్ని మనం సోషల్ మీడియాలో, జాబ్ పోర్టల్స్‌లో పోస్ట్ చేసే ఫొటోలే. అయితే ఈ ఫొటోలను మనం గూగుల్ నుంచి తొలగించుకునే అవకాశం ఉంది. గూగుల్ సెర్చ్‌లో ప్రత్యక్షమయ్యే మన ఫొటోలపై క్లిక్ చేసి ఫీడ్‌బ్యాక్‌లో కారణం వెల్లడించి ఫొటోను తొలగించమని గూగుల్‌కు విన్నవించుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఈ అవకాశం కేవలం పెద్దలకు మాత్రమే ఉంది.
తాజాగా గూగుల్ ఈ అవకాశాన్ని 18 ఏళ్లలోపు యూజర్లతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా తీసుకురానుంది. ఇటీవలి కాలంలో చిన్నారులు కూడా సోషల్ మీడియాను ఉపయోగించడం ఎక్కువై పోయింది. ఈ కారణంగా వారి ఫొటోలు కూడా నెట్టింట ప్రత్యక్షమవుతున్నాయి. చిన్నారుల ఫొటోలను దుర్వినియోగం చేస్తూ కొందరు మార్ఫింగ్ చేస్తూ వేధింపులకు దిగుతోన్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగానే ఫొటోలను తొలగించుకునే అవకాశాన్ని తీసుకురానుంది గూగుల్. 18 ఏళ్లు లోపు చిన్నారులు, కానీ వారి తల్లిదండ్రులు కానీ.. సంబంధిత ఫీడ్‌బ్యాక్‌ను చెప్పి ఫొటోను తొలగించుకోవచ్చు. ఈ నెల చివరి నాటికి ఈ అవకాశాన్ని తీసుకురానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను గూగుల్ ప్రస్తుతం.. ప్లే స్టోర్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి ఓ సారి మీ చిన్నారుల ఫొటోలు కూడా ఏమైనా ఉన్నాయో చూసి, వెంటనే వాటిని డిలీట్ చేసేయండి.
GSLV F10: ఒకటి.. రెండు దశలు బాగానే సాగినా.. మూడోదశలో విఫలం.. ఇస్రో ప్రయోగం ఫెల్యూర్‌కు కారణాలు ఇవే..
Banking Customers: మీకు ఇలాంటి మెసేజ్‌లు వచ్చాయా..? వాటిని క్లిక్ చేయకండి.. కొత్త రకం ఫిషింగ్ దాడి