Google Pixel 6: గూగుల్ పిక్సెల్ 6 సిరీస్‌లో అదిరిపోయే ఫీచర్స్‌.. వైడ్ యాంగిల్ ప్రధాన కెమెరా..టెలిఫొటో షూటర్!

|

Aug 04, 2021 | 9:24 AM

Google Pixel 6: మార్కెట్లోకి రోజురోజుకు కొత్త స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకరికంటే ఒకరు పోటాపోటీగా అత్యాధునిక ఫీచర్స్‌తో విడుదల చేస్తున్నాయి. ఇక గూగుల్ పిక్సెల్..

Google Pixel 6: గూగుల్ పిక్సెల్ 6 సిరీస్‌లో అదిరిపోయే ఫీచర్స్‌.. వైడ్ యాంగిల్ ప్రధాన కెమెరా..టెలిఫొటో షూటర్!
Follow us on

Google Pixel 6: మార్కెట్లోకి రోజురోజుకు కొత్త స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకరికంటే ఒకరు పోటాపోటీగా అత్యాధునిక ఫీచర్స్‌తో విడుదల చేస్తున్నాయి. ఇక గూగుల్ పిక్సెల్ 6, గూగుల్ పిక్సెల్ 6 ప్రో స్మార్ట్ ఫోన్లను గూగుల్ అధికారికంగా ప్రకటించింది. గూగుల్ టెన్సార్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్లు లాంచ్ కానున్నాయి. దీంతోపాటు వీటికి సంబంధించిన కీలక స్పెసిఫికేషన్లను కూడా కంపెనీ టీజ్ చేసింది. మేడ్ బై గూగుల్ అనే ట్వీటర్ ఖాతా ద్వారా వీటిని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఇవి మూడు కలర్ కాంబినేషన్లలో లాంచ్ కానున్నాయి.

స్పెసిఫికేషన్లు

గూగుల్ పిక్సెల్ 6 ప్రోలో వైడ్ యాంగిల్ ప్రధాన కెమెరాను ఉండనుంది. దీంతో పాటుఅల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, టెలిఫొటో షూటర్ కూడా ఉండనున్నాయి. గూగుల్ పిక్సెల్ 6లో టెలిఫొటో సెన్సార్ తప్ప మిగతా రెండు సెన్సార్లు ఉండనున్నాయి. వీటిలో ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండనుంది. ఇక గూగుల్ పిక్సెల్ ప్రోలో 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. గూగుల్ పిక్సెల్ 6లో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫ్లాట్ డిస్‌ప్లేను అందించనున్నారు. ఈ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ ఫోన్లను కంపెనీ ప్రముఖ యూట్యూబర్లకు అందించింది. దీనికి సంబంధించిన కెమెరా షాట్లను ఈ యూట్యూబర్లను ఐఫోన్ 12 ప్రో, పిక్సెల్ 5 షాట్లతో పోల్చారు. గూగుల్ పిక్సెల్ 6 సిరీస్ ఫోన్లతో తీసిన కెమెరాలు కూడా చాలా బాగా వచ్చాయి. ఈ స్మార్ట్ ఫోన్లు ఈ సంవత్సరమే లాంచ్ కానున్నాయి. రెండు నెలల క్రితం లీకైన ఫొటోల తరహాలోనే దీని డిజైన్ ఉంది.

ఇవీ కూడా చదవండి

WhatsApp: వాట్సాప్‌ నుంచి కొత్త ఫీచర్‌.. హ్యాపీయర్ దెన్ యానిమేటెడ్ స్టిక్కర్స్.. ఎలా డౌన్‌లోడ్‌ చేయాలంటే

SBI yono Features: సైబర్‌ నేరాలకు చెక్‌ పెట్టేందుకు ఎస్‌బీఐ మరో ముందడుగు.. యోనో యాప్‌లో కొత్త ఫీచర్‌..