Google Android 13: సిమ్ లేకుండానే కాలింగ్.. గూగుల్ ఆండ్రాయిడ్ 13లో అదిరిపోయే ఫీచ‌ర్.. ఎలాగంటే?

|

Apr 05, 2022 | 4:27 PM

గూగుల్ తన తాజా ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 13 ప్రివ్యూ వెర్షన్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కొత్త ఓఎస్ వినియోగదారులు అనేక అధునాతన ఫీచర్లను పొందనున్నట్లు వార్తలు వస్తున్నాయి. Esper నివేదిక ప్రకారం..

Google Android 13:  సిమ్ లేకుండానే కాలింగ్.. గూగుల్ ఆండ్రాయిడ్ 13లో అదిరిపోయే ఫీచ‌ర్.. ఎలాగంటే?
Google Android 13
Follow us on

ఆండ్రాయిడ్ యూజర్లకు అదిరిపోయే వార్త త్వరలో రానుంది. కొత్త ఓఎస్ వర్షన్‌తో మీరు ఎన్నో ప్రయోజనాలను అందించేందుకు గూగుల్(Google New OS) ప్లాన్ చేస్తోంది. అందులో ఎంతో ప్రత్యేకమైంది కూడా ఉంది. గూగుల్ తన తాజా ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 13 ప్రివ్యూ వెర్షన్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కొత్త ఓఎస్ వినియోగదారులు అనేక అధునాతన ఫీచర్లను పొందనున్నట్లు వార్తలు వస్తున్నాయి. Esper నివేదిక ప్రకారం గూగుల్ నుంచి త్వరలో రానున్న ఆండ్రాయిడ్ 13(Google Android 13) ఓఎస్‌లో ఒకే SIM కార్డ్‌పై రెండు ఆపరేటర్ల సేవలను పొందగలగనున్నట్లు తెలుస్తోంది. ఇది వినియోగదారులకు గేమ్ ఛేంజర్ ఫీచర్‌గా ఉంటుందని టెక్ నిపుణులు అంటున్నారు. డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లు అదనపు నంబర్‌లను ఆపరేట్ చేయగలగడమే ఇందులోని ప్రత్యేక ప్రయోజనంగా నిలవనుంది.

నివేదిక ప్రకారం, ఈ OSలో మల్టిపుల్ ఎనేబుల్డ్ ప్రొఫైల్ (MEP) అనే ఫీచర్ అందుబాటులో ఉంటుంది. దీని సహాయంతో, మీరు ఒకే e-SIMలో రెండు ఆపరేటర్ల మధ్య మీ ప్రొఫైల్‌ను మార్చుకోవచ్చు. గూగుల్ 2020లో ఈ ఫీచర్‌కు పేటెంట్ ఇచ్చింది. ఈ ఫీచర్ రెండు డిజిటల్ సిమ్‌లను ఒకేసారి రన్ చేయడంలో సహాయపడుతుంది. గూగుల్ ఇంజినీరింగ్ దీనిని పిక్సెల్ హార్డ్‌వేర్‌లో పరీక్షిస్తున్నట్లు గతంలో కూడా నివేదికలు వచ్చాయి.

డ్యూయల్ ఇ-సిమ్ సపోర్ట్ యొక్క ప్రయోజనాలు..

స్మార్ట్‌ఫోన్‌లోని ఈ-సిమ్‌లో రెండు వేర్వేరు కంపెనీల నంబర్లను అమలు చేయగలిగినప్పుడు, సిమ్ స్లాట్ స్థానంలో మైక్రో SD కార్డ్‌ని ఫిక్స్ చేయవచ్చు. ఈ రోజుల్లో చాలా కంపెనీలు సిమ్ ట్రేలో మైక్రో ఎస్‌డీ కార్డ్‌ను ఇవ్వడం లేదు. అంతే కాకుండా బ్యాటరీ సైజును కూడా పెంచుకోవచ్చు. ఇది జరిగితే, బ్యాటరీ mAh కూడా పెరుగుతుంది. ఇది ఫోన్‌లోని బ్యాకప్‌ను కూడా పెంచుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే, ఫిజికల్ సిమ్ లేకుండా, మీరు స్మార్ట్‌ఫోన్‌లో రెండు వేర్వేరు నంబర్‌లను రన్ చేయగలుగుతారు.

Also Read: Coolers Below 5k: వేసవి ఉక్కబోతను భరించలేకపోతున్నారా.? రూ. 5 వేల లోపు బెస్ట్‌ కూలర్లపై ఓ లుక్కేయండి..

OnePlus 10 Pro: మార్కెట్లోకి వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌ వచ్చేసింది.. ఫీచర్లు చూస్తే ఔరా అనాల్సిందే..