Wifi At Railway Stations: రైల్వే స్టేషన్స్‌లో వెయిట్ చేయడం బోరింగ్‌గా ఉందా? ఒక్క క్లిక్‌తో అరగంట పాటు నాన్‌స్టాప్ సేవలు

భారతదేశంలో 6,108 రైల్వే స్టేషన్లలో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉంది. ఈ స్టేషన్లలో ప్రయాణీకులు హై-స్పీడ్ ఇంటర్నెట్‌కు అరగంట ఉచిత యాక్సెస్‌ను పొందుతారు. ఈ సేవ ఈశాన్య భారతదేశం నుంచి కాశ్మీర్ లోయ వరకు విస్తరించి ఉంది. రైల్‌ టెల్‌ భారతీయ రైల్వేలకు అనుబంధంగా ఉన్న ఒక రిటైల్ బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్‌కు సంబంధించి రైల్‌ వైర్‌ అని పిలిచే ఈ సేవ ద్వారా వైఫై ఇంటర్నెట్ సదుపాయాన్ని పర్యవేక్షిస్తుంది.

Wifi At Railway Stations: రైల్వే స్టేషన్స్‌లో వెయిట్ చేయడం బోరింగ్‌గా ఉందా? ఒక్క క్లిక్‌తో అరగంట పాటు నాన్‌స్టాప్ సేవలు
Wifi

Updated on: Aug 30, 2023 | 6:30 PM

సాధారణంగా మనం రైలు ప్రయాణం అంటే రైలు బయలుదేరే ముందు సమయానికి అక్కడి చేరుకోవడం అలవాటు ఉంటుంది. అయితే ఒక్కోసారి రైలు ఆలస్యమైతే సమయాన్ని గడపడం చికాకుగా ఉంటుంది. అధిక వినియోగం కారణంగా స్మార్ట్ ఫోన్ ద్వారా టైమ్ పాస్ చేద్దామన్నా సిగ్నల్స్ సరిగ్గా ఉండవు. ఈ నేపథ్యంలో రైల్వేస్టేషన్స్‌లో ఉచిత వైఫై సేవలు అందుబాటులో ఉన్నాయి. పెరుగుతున్న సాంకేతికత నేపథ్యంలో భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో ఇంటర్నెట్ కనెక్టివిటీని అందిస్తుంది. ప్రధాన భారతీయ రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై అందుబాటులో ఉంది. అయితే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని స్టేషన్లలో ఇది అందుబాటులో లేదు. భారతదేశంలో 6,108 రైల్వే స్టేషన్లలో ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో ఉంది. ఈ స్టేషన్లలో ప్రయాణీకులు హై-స్పీడ్ ఇంటర్నెట్‌కు అరగంట ఉచిత యాక్సెస్‌ను పొందుతారు. ఈ సేవ ఈశాన్య భారతదేశం నుంచి కాశ్మీర్ లోయ వరకు విస్తరించి ఉంది. రైల్‌ టెల్‌ భారతీయ రైల్వేలకు అనుబంధంగా ఉన్న ఒక రిటైల్ బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్‌కు సంబంధించి రైల్‌ వైర్‌ అని పిలిచే ఈ సేవ ద్వారా వైఫై ఇంటర్నెట్ సదుపాయాన్ని పర్యవేక్షిస్తుంది.

రైల్వే స్టేషన్లలో మీరు 30 నిమిషాల ఉచిత రోజువారీ ఇంటర్నెట్ వినియోగాన్ని ఆస్వాదించవచ్చు. వైఫై సేవ ఒక ఎంబీపీఎస్‌ వరకు వేగాన్ని అందిస్తుంది. అరగంట తర్వాత ఉపయోగిస్తే మాత్రం రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుం రూ.10 నుంచి ప్రారంభం అవుతుంది.  ఈ మొత్తంతో మీరు 34 ఎంబీపీఎస్‌ వరకు అధిక వేగంతో 5 జీబీ డేటాను పొందుతారు. ఈ ప్యాకేజీ ఒకే రోజు చెల్లుబాటులో ఉంటుంది. చెల్లింపులను నెట్ బ్యాంకింగ్, వాలెట్, క్రెడిట్ కార్డ్, యూపీఐ ద్వారా చేయవచ్చు. 

ఉచిత వైఫై సేవలను పొందడం ఇలా

  • మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై సెట్టింగ్‌లను తెరవాలి.
  • అందుబాటులో ఉన్న నెట్‌వర్క్‌లను గుర్తించాలి.
  • రైల్‌వైర్ నెట్‌వర్క్‌ని ఎంచుకోవాలి.
  • మీ మొబైల్ బ్రౌజర్‌ని తెరిచి రైల్‌వైర్‌ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేయాలి.
  • ఇక్కడ మన మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి.
  • అనంతరం మన మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. 
  • రైల్‌వైర్‌కు కనెక్ట్ చేయడానికి ఓటీపీ నంబర్‌ని మీ పాస్‌వర్డ్‌గా ఉపయోగించాలి.
  • మీరు ఇప్పుడు ఉచితంగా రైల్‌వైర్‌ సేవలను 30 నిమిషాల పాటు ఆశ్వాదించవచ్చు. 

మరిన్ని టెక్నాలజీ న్యూస్ కోసం

ఇవి కూడా చదవండి