Moto G85
తక్కువ బడ్జెట్లో టాప్ స్పెక్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. మన దేశంలోని టాప్ బ్రాండ్ అయిన మోటోరోలా నుంచి బడ్జెట్ లెవెల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయ్యింది. దాని పేరు మోటో జీ85. ఇది మిడ్ రేంజ్ 5జీ స్మార్ట్ ఫోన్. దీని ప్రారంభ ధర రూ. 17,999గా ఉంది. కానీ దీనిలో ప్రీమియం ఫీచర్లు ఉంటాయి. హార్డ్ వేర్ నుంచి సాఫ్ట్ వేర్ వరకూ అన్ని టాప్ క్లాస్ ప్రీమియం ఉంటాయి. దాదాపు మోటో ఎడ్జ్ సిరీస్ ఫీచర్లు దీనిలో ఉంటాయి. కర్వ్డ్ డిస్ ప్లే, లైట్ వెయిట్ డిజైన్, ఆకట్టుకునే పనితీరును కలిగి ఉంటుంది. మోటో జీ-సిరీస్లో సోనీ లిషియా 600 కెమెరా సెన్సార్ తో వచ్చిన మొదటిది ఇదే. కాగా ఇప్పుడు ఫోన్ పై ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ అద్భుతమైన సేల్ ను అందిస్తోంది. రూ. 1000 తగ్గింపుతో రూ. 16,999కే కొనుగోలు చేయొచ్చు. అది కూడా కాక యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగిస్తే రూ. 1000 తక్షణ తగ్గింపును కూడా అందిస్తుంది. అంతేకాక దీనికి అదనంగా ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5శాతం తగ్గింపును క్యాష్ బ్యాక్ గా పొందొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
మోటో జీ85లో ప్రత్యేకతలు ఇవి..
- మోటోజీ85 5జీ తేలికగా, స్లిమ్ డిజైన్‌ను కలిగి ఉంది. లెదర్ బ్యాక్ ప్యానెల్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది మంచి పట్టు, ఆకృతిని అందిస్తుంది. ఇది 120హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల పీఓఎల్ఈడీ కర్వ్డ్-డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1600నిట్‌ల పీక్ బ్రైట్ నెస్ ను అందిస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా రక్షణ పొందుతుంది. పరికరంలో షో-స్టాపింగ్ ఫీచర్ ఏంటంటే హై-ఎండ్ మోటో ఎడ్జ్ సిరీస్ మాదిరిగా ఉండే వంపు డిస్‌ప్లే. ఈ డిస్‌ప్లే శక్తివంతమైనది. ప్రత్యక్ష సూర్యకాంతిలో కూడా ఉపయోగించగలిగేంత ప్రకాశవంతంగా ఉంటుంది.
- మోటో జీ85 స్నాప్‌డ్రాగన్ 6 జెన్3 చిప్‌సెట్‌తో వస్తుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ తో జత చేసి ఉంటుంది. ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ వంటి ఏదైనా ఇతర పరికరంలో మీ ఫోన్‌ను ప్రతిబింబించడంలో మీకు సహాయపడే స్మార్ట్ కనెక్ట్ ఫీచర్ ఉంటుంది. ఇంకా ప్రీమియం మోటో ఎడ్జ్ సిరీస్ నుంచి కొన్ని అధునాతన ఫీచర్లు కూడా దీనిలో ఉంటాయి. ఫ్యామిలి స్పేస్, మోటో అన్ ప్లగ్డ్ వంటి కొన్ని యుటిలిటీ ఫీచర్‌లను కూడా అందిస్తుంది.
- ఈ స్మార్ట్‌ఫోన్ 33వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ సామర్థ్యం అద్భుతంగా ఉన్నప్పటికీ, మెరుగైన ఛార్జింగ్ వేగం బాగుండేది. ఫోన్‌ను 0 శాతం నుంచి 100 శాతానికి ఛార్జ్ చేయడానికి కేవలం 80 నిమిషాలు మాత్రమే పడుతుంది.
- మోటో జీ85 అనేది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్)తో సోనీ ఎల్‌వైటీ-600 సెన్సార్‌ను కలిగి ఉన్న మొదటి మోటో జీ-సిరీస్ ఫోన్ ఇది. 50-మెగాపిక్సెల్ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌తో వెనుక డ్యూయల్-కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. డేలైట్, నైట్‌లైట్ చిత్రాలు రెండూ ప్రకాశవంతంగా మరియు స్పష్టంగా ఉంటాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..