Flipkart Big Billion Days Sale: ఆ స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా 47శాతం తగ్గింపు.. ఆపై బ్యాంక్ ఆఫర్లు.. రూ. 10వేల లోపే కొనేయొచ్చు.. అవకాశం వదలొద్దు..

ముందుగానే ప్రకటించిన మాదిరిగానే ఈ సేల్లో పలు స్మార్ట్ ఫోన్లపై బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మోటోరోలాకు చెందిన పలు రకాల మోడళ్లపై డిస్కౌంట్లు ఉన్నాయి. వాటిల్లో మోటోరోలా ఎడ్జ్ 40 నియో నుంచి మోటో రోలా జీ32 వరకూ ఉన్నాయి. ఇవన్నీ భారీ తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. అక్టోబర్ 8వ తేదీన ప్రారంభమైన ఈ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో మోటో జీ32 పై నమ్మశక్యంకానీ తగ్గింపు లభిస్తోంది.

Flipkart Big Billion Days Sale: ఆ స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా 47శాతం తగ్గింపు.. ఆపై బ్యాంక్ ఆఫర్లు.. రూ. 10వేల లోపే కొనేయొచ్చు.. అవకాశం వదలొద్దు..
Moto G32

Edited By: Ravi Kiran

Updated on: Oct 10, 2023 | 9:00 AM

ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2023 ప్రారంభమైంది. దీనిలో అన్ని రకాల వస్తువులపై అదిరే ఆఫర్లు లభిస్తున్నాయి. ముందుగానే ప్రకటించిన మాదిరిగానే ఈ సేల్లో పలు స్మార్ట్ ఫోన్లపై బెస్ట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మోటోరోలాకు చెందిన పలు రకాల మోడళ్లపై డిస్కౌంట్లు ఉన్నాయి. వాటిల్లో మోటోరోలా ఎడ్జ్ 40 నియో నుంచి మోటో రోలా జీ32 వరకూ ఉన్నాయి. ఇవన్నీ భారీ తగ్గింపు ధరలకు లభిస్తున్నాయి. అక్టోబర్ 8వ తేదీన ప్రారంభమైన ఈ ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో మోటో జీ32 పై నమ్మశక్యంకానీ తగ్గింపు లభిస్తోంది. ఈ డీల్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

47శాతం డిస్కౌంట్..

మోటోరోలా జీ32 స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్లో ఏకంగా 47శాతం వరకూ డిస్కౌంట్ లభిస్తోంది. అంతేకాక పలు రకాల బ్యాంకు ఆఫర్లు కూడా ఉన్నాయి. వాటిని వినియోగించుకుంటే ఈ ఫోన్ ను అతి తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. వాస్తవానికి మోటో జీ32 ఫోన్ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 18,999కి లాంచ్ చేసింది. అయితే దీనిని మీరు ఫ్లిప్ కార్ట్ సేల్లో రూ. 9,999కే సొంతం చేసుకోవచ్చు.

ఇవి ఆఫర్ వివరాలు..

మోటోజీ32 స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ 47శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అదనంగా ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై మరో 10శాతం తక్షణ తగ్గింపు రూ. 1000 వరకూ అందిస్తారు. ఈ ఫోన్ ను 2022 ఆగస్టు నెలలో మన దేశంలో లాంచ్ అయ్యింది. ఇది మోటోరోలా జీ సిరీస్ లో వచ్చిన ఆరో మొబైల్. ఇంతకు ముందు జీ82 5జీ, జీ 71 5జీ, జీ52 5జీ, జీ42 5జీ, జీ 22 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మోటో జీ32 స్పెసిఫికేషన్లు..

ఈ స్మార్ట్ ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే వస్తుంది. 90 హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్నాప్ డ్రాగన్ 680ఎస్ఓసీ చిప్ సెట్ ఆధారంగా పనిచేస్తుంది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 8ఎంపీ, 2ఎంపీ కెమెరాలు ఉంటాయి. ముందు వైపు 16ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సదుపాయంతో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఆధారంగా పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ తోపాటు 4జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..