25 Hours Day: ఇకపై రోజుకు 25 గంటలు.. ఆ మార్పులతోనే అసలు సమస్య

|

Aug 07, 2024 | 8:00 PM

సాధారణంగా ఒక రోజు అంటే 24 గంటల సమయం అనే విషయం అందరికీ తెలుసు. ఏడు రోజులు ఒక వారం, 365 రోజులకు ఏడాది పూర్తవుతుంది. తరతరాల నుంచి దీని ప్రాతిపదికనే క్యాలెండర్లు తయారువుతున్నాయి. వాటినే మనం అనుసరిస్తున్నాం. అయితే ఇటీవల శాస్త్రవేత్తల పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దాని ప్రకారం కొన్నాళ్లలో భూమిపై ఒక్కరోజుకు 25 గంటల సమయం అవుతుంది. దీనికి కారణం భూమికి చంద్రుడు దూరంగా వెళ్లపోతుండడమేనని కనుగొన్నారు.

25 Hours Day: ఇకపై రోజుకు 25 గంటలు.. ఆ మార్పులతోనే అసలు సమస్య
25 Hours In A Day
Follow us on

సాధారణంగా ఒక రోజు అంటే 24 గంటల సమయం అనే విషయం అందరికీ తెలుసు. ఏడు రోజులు ఒక వారం, 365 రోజులకు ఏడాది పూర్తవుతుంది. తరతరాల నుంచి దీని ప్రాతిపదికనే క్యాలెండర్లు తయారువుతున్నాయి. వాటినే మనం అనుసరిస్తున్నాం. అయితే ఇటీవల శాస్త్రవేత్తల పరిశోధనలో ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. దాని ప్రకారం కొన్నాళ్లలో భూమిపై ఒక్కరోజుకు 25 గంటల సమయం అవుతుంది. దీనికి కారణం భూమికి చంద్రుడు దూరంగా వెళ్లపోతుండడమేనని కనుగొన్నారు. విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన పరిశోధనలో భూమికి సంబంధించిన అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోజుకు 25 గంటల సమయం పెరగడానికి కారణాన్ని కూడా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చంద్రుడు భూమి నుంచి ఏడాదికి సుమారు 3.8 సెంటీమీటర్ల చొప్పున వెనక్కి తగ్గుతున్నాడని గుర్తించారు. దాని వల్ల భవిష్యత్తులో రోజుకు 25 గంటలు అవుతుందని తెలిపారు.

గతంలో రోజుకు 18 గంటలే..

రోజుకు 25 గంటల సమయాన్ని ప్రస్తుతం జీవించి ఉన్నవారెవ్వరూ చూసే అవకాశం లేదు. ఆ మార్పు జరగడానికి దాదాపు 200 మిలియన్ సంవత్సరాలు పడుతుందని అంచనా వేస్తున్నారు. శాస్త్రవేత్తల అధ్యయనం నిజమేనని అనడానికి కూడా ఆధారాలు ఉన్నాయి. గతంలో భూమిపై ఒక రోజుకు 18 గంటల కంటే ఎక్కువ సమయం ఉండేదంట. ఇది దాదాపు 1.4 బిలియన్ ఏళ్ల కిందట విషయం. దానిలో మార్పులు జరుగుతూ ఇప్పటికి 24 గంటలకు చేరింది. వీటిని పరిశీలిస్తే భవిష్యత్తులో 25 గంటల మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

గురుత్వాకర్షణలో మార్పులు

విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయంలోని జియోసైన్స్ విభాగం ప్రొఫెసర్ స్టీఫెన్ మేయర్స్ తెలిపిన వివరాల ప్రకారం.. భూమి, చంద్రుడికి మధ్య గల గురుత్వాకర్షణలో మార్పులే దీనికి ప్రధాన కారణం. భవిష్యత్తులో కాలంలో కలిగే మార్పుల తెలుసుకోవడానికి ఖగోళ శాస్త్రం ఎంతో ఉపయోగపడుతుంది. ఆధునిక భౌగోళిక ప్రక్రియల అధ్యయనానికి కీలకంగా మారుతుంది. అలాగే బిలియన్ల సంవత్సరాల పురాతన శిలలను అధ్యయనం చేయడం ద్వారా కూడా ప్రయోజనం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మారనున్న లెక్కలు

భూమికి చంద్రుడికి మధ్య దూరం పెరగడం వల్ల రోజుకు సమయం పెరుగుతుంది. ఇప్పుడున్నకాలానికి దాదాపు మరో గంట అదనంగా కలుస్తుంది. దీని ద్వారా క్యాలెండర్లలో లెక్కలన్నీ మారిపోతాయి. చంద్రుడు, భూమిలో జరుగుతున్న మార్పులను అధ్యయనం చేయగా ఈ విషయం వెల్లడైంది. పురాతన భౌగోళిక నిర్మాణాలు, అవక్షేప పొరలను పరిశీలించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని తెలియజేశారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..