Smartphone Tips
Smartphone: మనిషికి తిండి, నిద్ర, నీరు ఎంత తప్పనిసరో స్మార్ట్‌ఫోన్ కూడా అంతే తప్పనిసరిగా మారిపోయింది. చేతిలో స్మార్ట్‌ఫోన్ లేకపోతే ఏదో తెలియని లోటు. అంతలా స్మార్ట్‌ఫోన్ మన దైనందిక కార్యక్రమాల్లో భాగమైపోయింది. మొబైల్ ఫోన్ రీచార్జ్ నుంచి, సినిమా టికెట్ బుకింగ్ వరకు ఇలా ప్రతీ అవసరానికి స్మార్ట్‌ఫోన్‌పై ఆధారపడే రోజులు రావడం కూడా ఫోన్ వినియోగాన్ని అనివార్యంగా మార్చేసింది. అయితే స్మార్ట్‌ఫోన్‌లు ప్రారంభంలో ఉన్నంత వేగం కాలక్రమేణ ఉండదు. రోజులు గడుస్తోన్న కొద్దీ స్మార్ట్‌ఫోన్ వేగం తగ్గడం అనివార్యం. అయితే కొన్ని రకాల సింపుల్ ట్రిక్స్ ఫాలో అవ్వడం వల్ల స్లోగా మారిన ఫోన్‌ను మళ్లీ దారిలో పెట్టొచ్చు. ఇంతకీ ఆ ట్రిక్స్ ఏంటంటే..
- సాధారణంగా ఫోన్ వేగం తగ్గడానికి ప్రధాన కారణం తగినంత ర్యామ్ లేకపోవడమే. ముఖ్యంగా ఎక్కువ మెమోరీ ఉన్న యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల ర్యామ్ పనితీరుపై ప్రభావం ఉంటుంది. దీంతో ఫోన్ నెమ్మదిస్తుంది. కాబట్టి లైటర్ ఎడిషన్ ఉన్న యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల స్టోరేజీపై ప్రభావం పడదు, అలాగే ఫోన్ వేగం కూడా తగ్గదు.
- ఫోన్ పనితీరు వేగవంతం కావాలంటే స్మార్ట్‌ఫోన్‌లో స్టోర్ అయ్యే క్యాచ్ డేటాను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తుండాలి. ఫోన్‌లో చేసే ప్రతీ టాస్క్‌తో కొంత క్యాచ్ మెమొరీ స్టోర్ అవుతుంటుంది. ఇదే ఫోన్ వేగాన్ని తగ్గిస్తుంది. క్యాచ్ డేటాను డిలీట్ చేయడానికి ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి, అనంతరం ఎబౌట్ ఫోన్ ఆప్షన్‌ను క్లిక్ చేసి, అందులో కనిపించే క్యాచ్ డేటాను సెలక్ట్ చేసుకొని క్లియర్ చేయాలి.
- ఫోన్‌లో అవసరం ఉండే యాప్స్‌తో పాటు అవసరం లేని యాప్స్ కూడా ఉంటాయి. ఫోన్ వేగం తగ్గడంలో యాప్స్ కూడా ఓ కారణం. కాబట్టి అవసరం లేని యాప్స్‌ను డిలీట్ చేయడం వల్ల ఫోన్‌పై భారం తగ్గుతుంది.
- ఇక ఫోన్ వేగం పెంచేందుకు ఉన్న మరో ఆప్షన్ యానిమేషన్స్‌ను డిసేబుల్ చేసుకోవడం. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఎబౌట్ ఫోన్‌లో ఉన్న బిల్డ్ నెంబర్‌పై ఏడు సార్లు క్లిక్ చేయాలి. అనంతరం కనిపించే డెవలపర్ ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో డిసేబుల్ లేదా రెడ్యూస్ యానిమేషన్స్‌ను యాక్టివేట్ చేసుకోవాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..