మార్కెట్‌ను ముంచెత్తుతోన్న నకిలీ మసాలాలు.. ఎలా గుర్తించాలో తెలుసా.?

కిలీ వస్తువులను తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. కారం మొదలు, మిరియాల వరకూ అన్ని నకిలీ మసాలాలు తయారు చేస్తున్నారు. ఇలా మార్కెట్లో ఎన్నో రకాల నకిలీ మసాలాలను విక్రయిస్తున్నారు. వీటిని తినడం వల్ల ప్రజల ఆరోగ్యంపాడవుతుంది. అయితే నకిలీ మసాలాలను గుర్తించడానికి కొన్ని రకాల చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటంటే..

మార్కెట్‌ను ముంచెత్తుతోన్న నకిలీ మసాలాలు.. ఎలా గుర్తించాలో తెలుసా.?
Fake Spices

Updated on: Dec 02, 2023 | 4:29 PM

ప్రస్తుతం ఎక్కడా చూసినా మోసమో రాజ్యమేలుతోంది. ఈజీ మనీకి అలవాటు పడ్డ కొందరు నకిలీ వస్తువులను తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు. కారం మొదలు, మిరియాల వరకూ అన్ని నకిలీ మసాలాలు తయారు చేస్తున్నారు. ఇలా మార్కెట్లో ఎన్నో రకాల నకిలీ మసాలాలను విక్రయిస్తున్నారు. వీటిని తినడం వల్ల ప్రజల ఆరోగ్యంపాడవుతుంది. అయితే నకిలీ మసాలాలను గుర్తించడానికి కొన్ని రకాల చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటంటే..

* ప్రస్తుతం మార్కెట్లో కారంపొడిని కూడా కల్తీగా మార్చేస్తున్నారు. మిరప తొడిమలను గ్రైండ్ చేయడం, ఇటుక పొడి కలపడం, ఎర్రటి రంగు మట్టిని కలుపుతూ కల్తీ చేస్తున్నారు. దీనివల్ల అజీర్తి వంటి సమస్యలు వెంటాడుతున్నాయి. కల్తీ కారాన్ని గుర్తించాలంటే.. నీటిలో కొంత వేసి చూడాలి. ఎలాంటి కల్తీ లేని కారం నీటిలో తేలుతుంది, నకిలీ కారం నీటిలో మునిగిపోతుందని గుర్తుంచుకోవాలి.

* ధనియాల పొడిలో పిండి పొట్టును కలుపుతూ కల్తీ చేస్తున్నారు. ఇలాంటి కల్తీ పొడిని గుర్తించాలంటే.. ఒక గ్లాస్‌ నీటిలో టీస్పూన్ ధనియాల పొడిని వేయండి. కల్తీ లేని పొడి నీటిలో మునిగిపోతుంది. అదే నకిలీ పొడి అయితే నీటిపై తేలియాడుతుంది. అంతేకాకుండా వాసన ద్వారా కూడా ధనియాల నాణ్యతను గుర్తించవచ్చు.

* మార్కెట్లో నకిలీ రాళ్ల ఉప్పు మార్కెట్లో హల్చల్‌ చేస్తుంది. బంగాళాదుంపలను ఉపయోగించి నకిలీ ఉప్పును గుర్తించవచ్చు. ఇందుకోసం బంగాళదుంపను సగానికి కట్‌ చేయాలి. అనంతరం దానిపై చిటికెడు ఉప్పు వేసి దానిపై నిమ్మరసం వేయాలి. ఒకవేళ నకిలీ ఉప్పు అయితే మసకబారుతుంది. మంచి ఉప్పు అయితే ఎలాంటి మార్పుల ఉండదు.

* దాల్చిన చెక్కలో జామ చెట్టు బెరడును కలుపుతూ కల్తీ చేస్తున్నారు. అసలైన దాల్చిన చెక్కను చేతితో రుద్దితే గోధుమ రంగులోకి మారదు. ఒకవేళ నకిలీ దాల్చిన చెక్క అయితే చెక్క రంగు మాత్రమే వస్తుంది. ఈ సింపుల్‌ టెక్నిక్‌ ద్వారా నకిలీ దాల్చిన చెక్కను గుర్తించవచ్చు.

* ఎండు బొప్పాయి గింజలతో నకిలీ నల్ల మిరియాలను తయారు చేస్తూ మోసం చేస్తున్నారు. వీటిని గుర్తించడానికి ఓ టెక్నిక్‌ ఉంది. ఇందుకోసం నల్ల మిరియాలను నీటిలో వేయాలి. ఒకవేళ నకిలీ మిరియాలు అయితే నీటిలో తేలుతాయి, అదే మంచివి అయితే నీటిలో ముగినిగిపోతాయి.

* కొందరు అక్రమార్కులు నకిలీ పసుపును తయారు చేసేందుకు మిథనైల్‌ పసుపు అనే రసాయనాన్ని తయారు చేస్తారు. పసుపు నాణ్యతను తెలుసుకోవడానికి పసుపులో కొద్దిగా హైడ్రోక్లోరిక్‌ యాసిడ్‌ను కలపాలి. పసుపు రంగు నీలం లేదా గులాబీ రంగులోకి మారితే అది నకిలీ పసుపుగా గుర్తించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..