Super Money: ఫ్లిప్‌కార్ట్ నుంచి యూపీఐ సేవలు.. సూపర్‌ మనీ పేరుతో యాప్‌

|

Jun 28, 2024 | 7:18 PM

ఇక ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఈ సూపర్‌ మనీ బీటా వెర్షన్‌ ప్రస్తుతం యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ సహాయంతో యూజర్లు మొబైల్‌ ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో ఉన్న ఈ యాప్‌లో యూజర్ల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా మార్పులు చేర్పులు చేయనున్నట్లు కంపెనీ చెబుతోంది. ఇక సూపర్‌ మనీ యాప్‌ను ఉపయోగిస్తే...

Super Money: ఫ్లిప్‌కార్ట్ నుంచి యూపీఐ సేవలు.. సూపర్‌ మనీ పేరుతో యాప్‌
Upi
Follow us on

ప్రస్తుతం యూపీఐ సేవలకు భారీగా డిమాండ్ పెరుగుతోంది. దేశంలో డిజిటల్‌ ఎకానమీ రోజురోజుకీ పెరుగుతోంది. చిన్న చిన్న లావాదేవీలకు కూడా యూపీఐ పేమెంట్స్‌ను ఉపయోగిస్తున్నారు. దీంతో ఈ రంగంలోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటికే గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎమ్‌, భారత్‌పే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో యూపీఐ పేమెంట్స్‌ యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్ సైతం యూపీఐ మార్కెట్‌లోకి ప్రవేశించింది.

ఫ్లిప్‌కార్ట్‌ తన యూపీఐ పేమెంట్ యాప్‌ను సూపర్‌ మనీగా ప్రకటించింది. ఇప్పటికే ఈ యాప్‌కు సంబంధించి బీటా వెర్షన్‌ను విడుదల చేశారు. ఈ యాప్‌ యూజర్లకు గూగుల్ ప్లే స్టోర్‌లో అంబాటులో ఉంది. ఇదిలా ఉంటే 2016లో ఫ్లిప్‌కార్‌ ఫోన్‌పేను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే 2022లో ఫోన్‌పే ఫ్లిప్‌కార్ట్‌ నుంచి వేరుపడింది. ప్రస్తుతం ఈ రెండు కంపెనీలు కూడా వాల్‌మార్ట్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న ఈ సూపర్‌ మనీ బీటా వెర్షన్‌ ప్రస్తుతం యూజర్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ సహాయంతో యూజర్లు మొబైల్‌ ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చు. ప్రస్తుతం బీటా వెర్షన్‌లో ఉన్న ఈ యాప్‌లో యూజర్ల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా మార్పులు చేర్పులు చేయనున్నట్లు కంపెనీ చెబుతోంది. ఇక సూపర్‌ మనీ యాప్‌ను ఉపయోగిస్తే యూజర్లు క్యాష్‌ బ్యాంక్‌ పొందొచ్చని కంపెనీ చెబుతోంది. ఆర్థిక సేవలతో పాటు ప్రజలను ఒకరికి ఒకరు కనెక్ట్ చేసే విధాంగా ఈ యాప్‌ను తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదిలా ఉంటే యూజర్ల భద్రతకు కూడా పెద్దపీట వేస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. వినియోగదారుల లావాదేవీలు, డేటాపై పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది. యూజర్లు బ్యాంక్‌ కార్డుల ద్వారా కూడా లావాదేవీలు చేయొచ్చు. యూజర్లను ఆకర్షించే క్రమంలో దీని యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ను కూడా చాలా సింపుల్‌గా డిజైన్‌ చేశారు. మరి ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న యూపీఐ యాప్స్‌కు ఈ సూపర్‌ మనీ ఏ స్థాయిలో పోటీనిస్తుందో చూడాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..