ఆన్‌లైన్ ఈ కామర్స్ సైట్స్ పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే దసరా పురస్కరించుకొని ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లు సేల్స్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా దీపావళి పండుగను పుస్కరించుకొని ఫ్లిప్‌కార్ట్ దీవాళీ సేల్‌ను తీసుకొస్తోంది. అక్టోబర్ 11 నుంచి 16 వరకు అందుబాటులో ఉండనున్న ఈ సేల్‌లో భాగంగా అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. అన్ని రకాల ప్రాడక్ట్‌లపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఇక ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ఒక రోజు ముందు నుంచే అంటే.. అక్టోబర్ 10వ తేదీన సేల్ ప్రారంభం కానుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎస్‌బీఐతో కొనుగోలు చేసే వారికి ప్రత్యేకంగా 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ ఇవ్వనున్నారు. అలాగే పేటీఎంతో కొనుగోలు చేసిన వారికి కూడా 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం కల్పించారు. సేల్‌లో భాగంగా ఎంపిక చేసిన కొన్ని ప్రాడక్ట్‌లపై ఏకంగా 80 శాతం వరకు తగ్గింపు పొందొచ్చు. అలాగే ప్రింటర్లు, మానిటర్లపై ప్రత్యేకంగా 70 శాతం డిస్కౌంట్‌ను అందించనున్నారు. ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో టీవీలపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. 4కే అల్ట్రా హెచ్‌డీ టీవీ ధర రూ. 17,249 నుంచి ప్రారంభం కానుందని తెలిపింది.
ఇక కెమెరాలపై కూడా భారీగా డిస్కౌంట్ ఇవ్వనున్నారు. వాషింగ్ మెషీన్ల ధర రూ. 6,990 నుంచి ప్రారంభంకానుంది. అలాగే ఏసీలపై కూడా 55 శాతం డిస్కౌంట్ అందించనున్నారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌తో పాటు ఫ్యాషన్ ప్రాడక్డులపై కూడా భారీ డిస్కౌంట్ ఇవ్వనున్నారు. వీటిపై ఏకంగా 60 నుంచి 80 శాతం తక్కువ ధరకు వస్తువులు లభించనున్నాయి. అలాగే బ్యూటీ, ఫుడ్ ,టాయ్స్ ధర రూ.99 నుంచి ప్రారంభం అవుతోంది. మ్యాట్రసెస్.. సోఫా, సోఫా సెట్స్‌పై 50 శాతం డిస్కౌంట్ లభించనుంది. ఇక చైర్స్ అండ్ టేబుల్స్‌పై 80 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..