Google Pixel 6a: రూ. 44 వేల ఫోన్‌ను 27,669కే సొంతం చేసుకునే అవకాశం.. Google Pixel 6aపై బంపరాఫర్‌..

|

Sep 12, 2022 | 11:06 AM

Google Pixel 6a: ఒకప్పుడు పండుగ సీజన్‌ వస్తే షాపింగ్‌ మాల్స్‌ ఆఫర్స్‌ను ప్రకటించేవి. అయితే ఇప్పుడు వాటితో పాటు ఆన్‌లైన్‌లోనూ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ కామర్స్‌ సైట్స్‌ వినియోగదారులను ఆకర్షించే క్రమంలోనే భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి...

Google Pixel 6a: రూ. 44 వేల ఫోన్‌ను 27,669కే సొంతం చేసుకునే అవకాశం.. Google Pixel 6aపై బంపరాఫర్‌..
Google Pixel 6a
Follow us on

Google Pixel 6a: ఒకప్పుడు పండుగ సీజన్‌ వస్తే షాపింగ్‌ మాల్స్‌ ఆఫర్స్‌ను ప్రకటించేవి. అయితే ఇప్పుడు వాటితో పాటు ఆన్‌లైన్‌లోనూ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ కామర్స్‌ సైట్స్‌ వినియోగదారులను ఆకర్షించే క్రమంలోనే భారీ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే దసరాకు ప్రముఖ ఈ కామర్స్‌సైట్స్‌ సేల్స్‌ను నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డే పేరుతో భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోంది. ఈ నెల చివర్లో ప్రారంభంకానున్న ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్‌ ఫోన్‌లు, టీవీలతో పాటు పలు రకాల గృహాపకరణాలపై ఆఫర్లు ప్రకటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో గూగుల్‌ పిక్సెల్‌6ఏ స్మార్ట్‌ఫోన్‌పై కూడా అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది ఫ్లిప్‌ కార్ట్‌. ఈ స్మార్ట్‌ఫోన్‌ అసలు ధర రూ. 43,999 కాగా, ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో భాగంగా కేవలం రూ. 27,669కే సొంతం చేసుకునే అవకాశం రానుంది. అంటే దాదాపు రూ. 16500 డిస్కౌంట్‌కు ఈ ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం కలగనుందన్నమాట. అంతేకాకుండా ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తూ 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ ఇవ్వనున్నారు. అలాగే ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కింద రూ. 20,000 తగ్గింపు ధరకు ఇవ్వనున్నారు.

గూగుల్‌ పిక్సెల్‌ 6ఏ ఫీచర్లు..

ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ఫుల్‌ హెచ్‌డీ+తో కూడిన 6.1 ఇంచెస్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. గోరిల్లా గ్లాస్‌ 4 ప్రొటెక్షన్‌ ఈ స్క్రీన్‌ సొంతం. ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో ఫాస్ట్‌ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4410 ఎమ్‌ఏహెచ్‌తో కూడిన బ్యాటరీని అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..