Big Billion Days: పండగ సీజన్‌ను క్యాష్ చేసుకోవడానికి ఆన్‌లైన్ ఈకామర్స్ సైట్స్ వరుస ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ పోటాపోటీగా డిస్కౌంట్లను అందిస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ పేరుతో సేల్‌ను ప్రారంభించిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 30 తేదీ వరకు కొనసాగనున్న ఈ సేల్‌లో అదిరిపోయే ఆఫర్లను తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా ఫ్లిప్ కార్ట్ సేల్‌లో రానున్న కొన్ని బెస్ట్ సేల్స్ వివరాలు మీకోసం.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా కొన్ని స్మార్ట్ టీవీలపై ఏకంగా 80 శాతం డిస్కౌంట్స్ లభించనున్నాయి. అలాగే స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాలతో భారీగా ఆఫర్లను అందించనుంది.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా శామ్‌సంగ్, వీయూ, ఎల్‌జీ, మోటరోలా, ఎమ్‌ఐ, వన్‌ప్లస్‌లు స్మార్ట్ టీవీలపై భారీ ఆఫర్లను ప్రకటించనున్నాయి. ఈ సేల్‌లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన స్మార్ట్ టీవీ బ్లాపంక్ట్ (Blaupunkt) క్యూ ఎల్‌ఈడీ. 50, 55, 65 ఇంచెస్ వేరియంట్స్‌తో విడుదలైన ఈ టీవీ ప్రారంభం ధర ఆఫర్‌లో భాగంగా రూ. 36,999కి అందుబాటులో ఉండనుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 27,999 కాగా బిగ్‌బిలియన్ డేస్ సేల్‌లో భాగంగా రూ. 19,999కే సొంతం చేసుకోవచ్చు. 64 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరా, సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే, డాల్బీ విజన్, ఆటమ్స్‌తో పాటు మరెన్నో అద్భుత ఫీచర్లు ఈ ఫోన్‌లో అందించారు.
ఈ సేల్‌లో మోటోరోలాపై భారీ ఆఫర్లు ప్రకటించారు. మోటో జీ62 5జీ స్మార్ట్‌ఫోన్‌ను సేల్లో కేవలం రూ. 14,499కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో పాటు మోటో జీ32పై అదిరిపోయే డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.
ఫ్రిడ్జ్‌లపై కూడా మంచి ఆఫర్లను అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. శామ్‌సంగ్, బోష్, వాల్‌పూల్ వంటి బ్రాండ్‌ల రిఫ్రిజిరేట్లపై ఏకంగా 55 శాతం డిస్కౌంట్ లభించనుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..