Edge 40: మోటోరోలా ఫోన్‌పై రూ. 10 వేల డిస్కౌంట్‌.. కర్వ్డ్‌ డిస్‌ప్లేతో పాటు స్టన్నింగ్ ఫీచర్స్‌

|

Oct 10, 2023 | 7:40 PM

ఇందులో భాగంగానే ఫ్లిప్‌ కార్ట్ బిగ్ బిలియన్‌ డేస్‌లో భాగంగా మోటోరోలా ఎడ్జ్‌ 40 స్మార్ట్ ఫోన్‌పై 28 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 34,999కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 24,999కే సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు యాక్సిస్‌ బ్యాంక్, సిటీ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో రూ. 1000 డిస్కౌంట్‌ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 23,999కే సొంతం చేసుకోవచ్చు...

Edge 40: మోటోరోలా ఫోన్‌పై రూ. 10 వేల డిస్కౌంట్‌.. కర్వ్డ్‌ డిస్‌ప్లేతో పాటు స్టన్నింగ్ ఫీచర్స్‌
Motorola Edge 40
Follow us on

ప్రస్తుతం దేశంలో ఈ కామర్స్‌ సైట్స్‌ సేల్స్‌తో హోరెత్తిస్తున్నాయి. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు, గృహోపకరణల వరకు అన్ని రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తూ కస్టమర్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. వీటికి అదనంగా పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్‌, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసిన వారికి అదనంగా 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ అందిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అమెజాన్‌ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ అందిస్తున్నారు.

ఇందులో భాగంగానే ఫ్లిప్‌ కార్ట్ బిగ్ బిలియన్‌ డేస్‌లో భాగంగా మోటోరోలా ఎడ్జ్‌ 40 స్మార్ట్ ఫోన్‌పై 28 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ అసలు ధర రూ. 34,999కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 24,999కే సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు యాక్సిస్‌ బ్యాంక్, సిటీ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో రూ. 1000 డిస్కౌంట్‌ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్‌ను రూ. 23,999కే సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 21,400 డిస్కౌంట్‌ను పొందొచ్చు.

ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ ర్యామ్‌ను ఇచ్చారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+ 3డీ కర్వ్డ్‌ డిస్‌ప్లేను అందించారు. ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 144Hzగా ఉంది. మోటో ఎడ్జ్‌ 40 స్మార్ట్ ఫోన్‌ డైమెన్సిటీ 8020 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 32 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

ఇక మోటోరోలో ఎడ్జ్‌ 40 స్మార్ట్ ఫోన్‌లో 4400 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 15 వాట్స్‌ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌, 5 వాట్స్‌ రివర్స్‌ వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌లో తీసుకొచ్చిన ఐపీ68 రేటెడ్‌తో 30 నిమిషాల పాటు నీటిలో ఉన్నా తట్టుకునే విధంగా ఈ ఫోన్‌ను రూపొందించారు. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ ఫోన్‌ను ఒక్కసారిగా ఛార్జ్‌ చేస్తే 30 గంటలు నాన్‌స్టాప్‌గా వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..