Facebook:ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్ ఉపయోగించే వారి భారీగానే ఉంటుంది. ఇలాంటి యూజర్లకు ఫేస్‌బుక్ గుడ్‌న్యూస్ అందించింది. లైవ్ ఆడియో రూమ్స్‌ను ప్రవేశపెట్టింది. ఈ లైవ్ ఆడియో రూమ్స్ ఆండ్రాయిడ్, డెస్క్‌టాప్ యూజర్లకు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ లైవ్ ఆడియో రూమ్స్ సెలబ్రిటీలకు, కొన్ని గ్రూప్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లు సొంతంగా లైవ్ ఆడియో రూమ్స్ క్రియోట్ చేసే ఫీచర్‌ను త్వరలోనే తెచ్చేందుకు ఫేస్‌బుక్ ప్రయత్నాలను చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఫేస్‌బుక్ క్లబ్ హౌజ్, ట్విటర్‌స్పేస్ తరహా లాంటి ఆడియో రూమ్స్‌ను క్రియోట్ చేసేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా యూజర్లకు లైవ్ ఆడియో రూమ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ లైవ్ ఆడియో రూమ్స్‌లో స్పీకర్‌గా చేరడానికి ప్రజలను ఆహ్వానించే శక్తి హోస్ట్‌కి ఉంది. కాగా స్పీకర్ చేసే సంభాషణను ఎవరైనా వినే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం ఫేస్ బుక్ లైవ్ వీడియో కేవలం 50 మంది స్పీకర్‌కు మాత్రమే అనుమతినిస్తుంది ఫేస్‌బుక్. వీరు ఏం మాట్లాడుకుంటారో వినేవారికి ఎలాంటి పరిమితిని విధించలేదు. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. కొన్ని సమస్యలు తీరే అవకాశం ఉంది. ట్విట్టర్ స్పేస్, క్లబ్ హౌజ్ వంటి యాప్స్ న డౌన్ లోడ్ చేసుకోవడంలో యూజర్లకు కాస్త ఉపశమనమే అని చెప్పవచ్చు.