Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో ఈవీ చార్జింగ్ స్టేషన్ వివరాలు.. ఎలా చూసుకోవాలో తెలుసా?

|

Feb 10, 2023 | 2:10 PM

గూగుల్ ఓ కొత్త సర్వీస్‌తో మన ముందుకు వచ్చింది. తన మ్యాప్స్‌లో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లను తెలిపే విధంగా అప్‌డేట్ చేసినట్లు ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది.

Google Maps: గూగుల్ మ్యాప్స్‌లో ఈవీ చార్జింగ్ స్టేషన్ వివరాలు.. ఎలా చూసుకోవాలో తెలుసా?
Google Maps
Follow us on

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తుంది. పెరుగుతున్న పెట్రోల్ రేట్ల దెబ్బకు అందరూ ఈవీ వాహనాల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో ఈవీ వాహనాలు వినియోగం బాగా పెరిగింది. అయితే ఈవీ వాహనాలను వేధించే సమస్య ఒక్కటే. అదే చార్జింగ్. ఎక్కడికైనా లాంగ్ రైడ్స్‌కు వెళ్లినప్పుడు ఈవీ వాహనాలను ఎలా చార్జ్ చేసుకోవాలో తెలియక ఇబ్బందిపడతాం. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ గూగుల్ ఓ కొత్త సర్వీస్‌తో మన ముందుకు వచ్చింది. తన మ్యాప్స్‌లో ఎలక్ట్రిక్ చార్జింగ్ స్టేషన్లను తెలిపే విధంగా అప్‌డేట్ చేసినట్లు ఇటీవల ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇందులో కొత్త విషయం ఏముంది? ఎప్పటి నుంచో ఉన్నవే కదా? అని అనుకుంటున్నారా? ఇక్కడే అస్సలు విషయం ఉంది. 150 కిలో వాట్స్ కంటే ఎక్కువ చార్జింగ్ స్టేషన్లు మాత్రమే అందులో చూపిస్తుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఈ సర్వీసులు విదేశాల్లో అందుబాటులోకి తెచ్చింది. త్వరలో ఇండియాలో కూడా ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

గూగుల్ మ్యాప్స్‌లో వెరీ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్ ఫీచర్ ద్వారా 150 కిలో వాట్స్ కంటే ఎక్కువ స్పీడ్‌తో చార్జ్ అయ్యే చార్జింగ్ స్టేషన్లు మాత్రమే చూపిస్తుంది. అలాగే కేవలం 40 నిమిషాల్లో పూర్తిగా చార్జ్ అయ్యే స్టేషన్ల వివరాలను పొందడానికి తన అప్లికేషన్ ను అప్‌డేట్ చేసింది. దీంతో పాటు సూపర్ మార్కెట్ వంటి ప్రాంతాల్లో ఆన్-సైట్ చార్జింగ్ స్టేషన్లు ఉంటే వాటిని కనుగొనే అవకాశం కూడా కల్పిస్తామని పేర్కొంది. తన ఏఐ అప్‌డేట్‌లో భాగంగా డిజిటల్ మోడ్‌లో మ్యాప్స్‌ను చూసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సర్వీసులు లండన్, లాస్‌ఏంజిల్స్, న్యూయార్క్, శాన్‌ఫ్రాన్సిస్‌కో, టోక్యో ప్రాంతాల్లో లాంచ్ చేసింది. భవిష్యత్ ఈ సేవలు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించనుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..