Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలు పెట్రోల్, డీజిల్ కంటే ఎక్కువ కాలుష్యాన్ని కలిగిస్తాయి..షాకింగ్‌ నివేదిక

|

Mar 08, 2024 | 11:17 AM

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణానికి సురక్షితమైనవని సాధారణంగా నమ్ముతారు. ఎందుకంటే అవి తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తాయి. అయితే దీనిపై పరిశోధన నివేదిక షాకింగ్‌గా ఉంది. ఉద్గారాల డేటాను విశ్లేషించే ఎమిషన్ అనలిటిక్స్ అనే సంస్థ ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. అధ్యయనంలో గ్యాస్, ఇతర ఇంధనాలతో పోల్చితే పర్యావరణానికి ఎలక్ట్రిక్ వాహనం ఎంత సురక్షితమైనదో తెలుసుకోవడానికి

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలు పెట్రోల్, డీజిల్ కంటే ఎక్కువ కాలుష్యాన్ని కలిగిస్తాయి..షాకింగ్‌ నివేదిక
Ev Cars
Follow us on

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలు పర్యావరణానికి సురక్షితమైనవని సాధారణంగా నమ్ముతారు. ఎందుకంటే అవి తక్కువ కాలుష్యాన్ని కలిగిస్తాయి. అయితే దీనిపై పరిశోధన నివేదిక షాకింగ్‌గా ఉంది. ఉద్గారాల డేటాను విశ్లేషించే ఎమిషన్ అనలిటిక్స్ అనే సంస్థ ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. అధ్యయనంలో గ్యాస్, ఇతర ఇంధనాలతో పోల్చితే పర్యావరణానికి ఎలక్ట్రిక్ వాహనం ఎంత సురక్షితమైనదో తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం జరిగింది. పరిశోధన ఫలితాలు షాకింగ్ ఫలితాలను వెల్లడించాయి.

చమురుతో నడిచే కార్ల కంటే ఎలక్ట్రిక్ వాహనాల బ్రేక్‌లు, టైర్లు 1850 రెట్లు ఎక్కువ కాలుష్యాన్ని వ్యాపింపజేస్తాయని పరిశోధన నివేదిక పేర్కొంది. ఈ అధ్యయనం ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ కంటే కాలుష్యం పరంగా ఎలక్ట్రిక్ వాహనాలు సురక్షితమైనవని నమ్ముతారు. అవి తక్కువ గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తాయి. అయితే దీనిపై కొత్త పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. దీంతో పాటు ఇందుకు గల కారణాలను కూడా వివరించారు.

ఈవీలు గాలిని ఎందుకు విషపూరితం చేస్తాయి?

ఇవి కూడా చదవండి

ఎమిషన్ అనలిటిక్స్ నివేదిక ప్రకారం.. ఎలక్ట్రిక్ వాహనాలు ఎక్కువ బరువు కలిగి ఉంటాయి. అధిక బరువు కారణంగా దాని టైర్లు త్వరగా అరిగిపోతాయి. అంటే ఆ టైర్ల వ్యాలిడిటీ వేగంగా తగ్గిపోతుంది. అవి హానికరమైన రసాయనాలను గాలిలోకి విడుదల చేస్తాయి. చాలా టైర్లు ముడి చమురు నుండి పొందిన సింథటిక్ రబ్బరుతో తయారు చేయబడతాయి. ఇవి కాలుష్యానికి కారణమవుతాయి. ఈవీ బ్యాటరీ పెట్రోల్ ఇంజిన్ కంటే భారీగా ఉంటుంది. ఈ అదనపు బరువు బ్రేక్‌లు, టైర్లపై పడి వాటి జీవితకాలం వేగంగా తగ్గిపోతుంది. పరిశోధన నివేదికలో టెస్లా మోడల్ Y, ఫోర్డ్ F-150 రెండు వాహనాలు సుమారు 1800 పౌండ్ల బ్యాటరీని కలిగి ఉన్నాయని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాల్లో అమర్చిన ఈ అర టన్ను బ్యాటరీ పెట్రోల్ కారు కంటే 400 రెట్లు ఎక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుంది. ఈ విధంగా, సురక్షితంగా భావించే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా కాలుషానికి కారణమవుతాయని నివేదిక తెలిపింది.

అందుకే కాలుష్యం ఎక్కువగా వ్యాపిస్తోంది

ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీలపై పరిశోధన నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచడానికి, బ్యాటరీని విచ్ఛిన్నం చేయడం కూడా అవసరమని తెలిపింది. బ్యాటరీ విచ్ఛిన్నం కాకపోతే పర్యావరణానికి ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల ఈవీ బ్యాటరీ కూడా ఒక ముఖ్యమైన అంశం. మునుపటి పరిశోధనలో బ్యాటరీని విచ్ఛిన్నం చేయడంలో అజాగ్రత్త పర్యావరణానికి ముప్పుగా వర్ణించబడింది. ఈ విధంగా చూస్తే, ఇప్పటి వరకు పర్యావరణానికి సురక్షితమైనవిగా పరిగణించబడుతున్న ఈవీలు వాటి గురించి చెప్పుకున్నంత సురక్షితంగా లేవని చెప్పవచ్చు. అందుకే ఎలక్ట్రిక్ వాహనాలపై ఈ అధ్యయనం దిగ్భ్రాంతిని కలిగించింది. పర్యావరణాన్ని సురక్షితంగా మార్చే దిశగా మనల్ని హెచ్చరిస్తుంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి