Electric SUV: ఈ ఎలక్ట్రిక్‌ కారుకు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 500 కిలోమీటర్ల మైలేజీ..

|

Oct 30, 2022 | 8:19 AM

పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. కార్ల తయారీ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేసేందుకు..

Electric SUV: ఈ ఎలక్ట్రిక్‌ కారుకు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 500 కిలోమీటర్ల మైలేజీ..
Electric Cars
Follow us on

పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. కార్ల తయారీ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఎలక్ట్రిక్‌ కార్లు అందుబాటులోకి రాగా, త్వరలో మరిన్ని కొత్త ఈవీ కార్లు రోడ్లపైకి రావడానికి సిద్ధంగా ఉన్నాయి. బెంగుళూరులోని స్టార్టప్ కంపెనీ అయిన ప్రవైగ్ కూడా కస్టమర్ డిమాండ్ ఆధారంగా వివిధ కార్ల మోడల్‌లను అభివృద్ధి చేస్తోంది.రాబోయే రోజుల్లో తన మొదటి ఈవీ కార్ మోడల్‌ను లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది.

2021లో తొలిసారిగా తన కొత్త Extinction MK1 ఎలక్ట్రిక్ సెడాన్ మోడల్‌ను ఆవిష్కరించిన ప్రవేఘ్ ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ SUVని సిద్ధం చేస్తోంది. కాన్సెప్ట్ ఎస్‌యూవీ టీజర్ అత్యాధునిక డిజైన్‌తో విడుదల చేయబడింది. కొత్త కారు బాహ్య డిజైన్‌తో పాటు టీజర్‌లో ఎటువంటి సాంకేతిక సమాచారం గురించి వివరాలు అందించలేదు.

బ్యాటరీ, మైలేజ్

గతంలో ఆవిష్కరించిన Extition MK1 EV సెడాన్ మోడల్ మాదిరిగానే, కొత్త ఎస్‌యూవీ ఎలక్ట్రిక్‌ కారు కూడా అత్యుత్తమ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. కొత్త ఎస్‌యూవీ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే సుమారు 500 వరకు మైలేజీ ఇస్తుందని తెలుస్తోంది. ఈ కారు దాదాపు 402 bhp అవుట్‌పుట్‌తో 200 kmph గరిష్ట వేగాన్ని కలిగి ఉంటుంది. కొత్త EV SUV కేవలం 5.4 సెకన్లలో సున్నా నుండి 100 kmph వరకు వేగాన్ని అందుకునే సామర్థ్యంతో ఉండనుంది.

ఇవి కూడా చదవండి

డిజైన్, ఫీచర్లు

టీజర్ చిత్రంలో చూసినట్లుగా, ప్రవేగ్ కొత్త EV SUV రేంజ్ రోవర్ మోడల్‌ల వంటి కొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది, అయితే ముందు డిజైన్ గురించి ఎటువంటి సమాచారం భాగస్వామ్యం చేయబడలేదు. ప్రస్తుతం యలహంకలోని రీసెర్చ్ సెంటర్‌లో కొత్త కారు కాన్సెప్ట్ మోడల్‌ను పరీక్షిస్తూ, తుది ప్రొడక్షన్ వెర్షన్‌ను త్వరలో ఆవిష్కరించనున్నారు. కొత్త కారులో ఆకర్షణీయమైన డ్యాష్‌బోర్డ్, స్పోర్టీ స్టీరింగ్ వీల్, సౌకర్యవంతమైన సీటింగ్ సౌకర్యం, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెహికల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌తో పాటు అద్భుతమైన బూట్ స్పేస్, బ్లాక్ అవుట్ మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్, అనేక ఇతర ఆకర్షణీయమైన సాంకేతిక ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి