
Drunk and Drive: తప్పతాగి వాహనాలను నడిపేవారిని గుర్తించి తాట తీస్తుంటారు పోలీసులు. అయితే, మందుబాబులను గుర్తించడం కోసం ఇప్పటివరకూ బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షలు జరుపుతూ వస్తున్నారు. ఈ పరికరం ద్వారా నోటి నుంచి వదిలిన ఊపిరితో ఆల్కహాల్ లెవెల్స్ లెక్క వేస్తారు. దానిలో వచ్చిన ఫలితాలతో ఒక వ్యక్తి మందు తాగాడా లేదా? తేలిపోతుంది. తరువాత మందేసి వాహనాన్ని నడుపుతున్న వారికి శిక్షలు అమలు చేస్తూవస్తున్నారు పోలీసులు. అయితే, కరోనా మహమ్మారి విరుచుకుపడిన నేపధ్యంలో.. ఈ మహమ్మారి శ్వాస ద్వారా వ్యాపించే అవకాశం ఉన్న నేపధ్యంలో చాలాకాలం పాటు బ్రీత్ ఎనలైజర్ తో ఈ పరీక్షలు నిలిపివేశారు. ఇప్పుడిప్పుడే మళ్ళీ వీటిని మొదలు పెట్టారు. ఈ నేపధ్యంలో బ్రీత్ ఎనలైజర్ లా పనిచేసే కొత్త పరికరం కనిపెట్టారు శాస్త్రవేత్తలు. అయితే, ఇది శ్వాస ద్వారా కాకుండా చెవిలో పెట్టడం ద్వారా మందుబాబులను గుర్తిస్తుంది.
ఇకపై ఒక వ్యక్తి మద్యం సేవించాడా లేదా అని పరీక్షించడానికి త్వరలో బ్రీత్ ఎనలైజర్ అవసరం ఉండదు. జపనీస్ శాస్త్రవేత్తలు దాని పరిశోధన కోసం ప్రత్యేక రకం పరికరాన్ని రూపొందించారు. ఇది వాక్‌మ్యాన్ లాగా కనిపించే పరికరం. దీనికి ఇయర్‌మఫ్ అని పేరు పెట్టారు. ఈ పరికరాన్ని చెవిలో ఉంచడం ద్వారా, ఒక వ్యక్తిలో ఆల్కహాల్ ఎంత ఉందో సులభంగా తెలుసుకోవచ్చు.
పరికరం ఇలా పనిచేస్తుంది
బ్రీత్ ఎనలైజర్ కంటే కొత్త పరికరం ఎందుకు ఉత్తమం
బ్రీత్ అనలైజర్ నోటిలో ఉంచాల్సి వస్తుంది. దీనిపై చాలా మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది కాకుండా, మద్యం తాగిన తర్వాత, ప్రజలు మౌత్ వాష్ లేదా బ్రీత్ స్ప్రే ఉపయోగించి పోలీసులను మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. కొత్త పరికరం చెవిపై ఉపయోగిస్తారు. అందువల్ల మందుబాబులు పరికరాన్ని ఏమార్చడం చాలా కష్టం. ఇది ఖచ్చితమైన ఫలితాలను ఇస్తుంది.
Also Read: Smart T-Shirt: గుండె వేగాన్ని చెప్పే ఇస్మార్ట్ టీ-షర్ట్.. వీడియో