Facebook: ఫేస్‌బుక్ నీలం రంగులోనే ఎందుకు ఉంటుంది? కారణం చెప్పిన మార్క్ జుకర్‌బర్గ్

Facebook: ఫేస్‌బుక్‌.. దీని గురించి తెలియనివారంటూ ఉండరేమో. ఫేస్‌బుక్‌ అనేది ఎంతో మంది జీవితంలో భాగమైపోయింది. అయితే ఫేస్‌బుక్‌ కలర్స్‌ బ్లూ కలర్స్‌లో ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. ఇదే కలర్‌లో ఎందుకు ఉంటోందో మీకు తెలుసా? అందుకు కారణం సీఈవో జుకర్‌బర్గ్‌ వెల్లడించారు..

Facebook: ఫేస్‌బుక్ నీలం రంగులోనే ఎందుకు ఉంటుంది? కారణం చెప్పిన మార్క్ జుకర్‌బర్గ్

Updated on: Feb 28, 2025 | 9:23 AM

మనమందరం ఎక్కువ సమయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో గడుపుతాము. Facebook UI పూర్తిగా నీలం రంగులో ఉంటుందన్న విషయం అందరికి తెలిసిందే. ఫేస్‌బుక్‌లో దాదాపు అన్ని కలర్స్‌ కూడా నీలం రంగులోనే ఉంటాయి. ఇలా ఎందుకు ఎంటుందోనని మీరెప్పుడైనా గమనించారా? అందుకు కారణం ఉంది. కంపెనీ దాన్ని కలర్‌ను ఎందుకు మార్చదు లేదా యాప్‌లో నీలం రంగును మాత్రమే ఉంచడానికి కారణం ఏమిటి? ఓ సమయంలో ఫేస్‌బుక్ రంగు నీలం రంగులో ఉండటానికి కారణం ఆ కంపెనీ CEO మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు.

ఇప్పుడు మెటాగా పేరు మార్చబడిన ఫేస్‌బుక్, దాని CEO మార్క్ జుకర్‌బర్గ్ కలర్ బ్లైండ్ ఉందని చెప్పారు. ముఖ్యంగా ఆకుపచ్చ, ఎరుపు రంగులను అర్థం చేసుకోవడంలో అతనికి ఇబ్బంది ఉండేది. అయితే ఆయన నీలం రంగును స్పష్టంగా చూడగలరట. అందుకే ప్రతి ఫేస్‌బుక్ ఐకాన్, దాని గురించి ప్రతిదీ నీలి రంగు వివిధ షేడ్స్‌లో ఉంటుంది. ఫేస్‌బుక్‌లో రంగు ఎరుపు, ఆకుపచ్చగా ఉండకుండా కేవలం బ్లూ కలర్‌ మాత్రమే ఉండేలా చేశారని చెప్పారు.

ఇది కూడా చదవండి: Gold Price Today: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులంపై ఎంత తగ్గిందో తెలుసా..?

నీలం రంగును చాలా స్పష్టంగా చూడగలవు.. అందుకే మెటా రంగు నీలంగా ఉంటుందని అని చెప్పారు.  ఫేస్‌బుక్‌ను సృష్టించే ముందు జుకర్‌బర్గ్ తన కళాశాల రోజుల్లో ఫేస్‌మాస్ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఫేస్‌బుక్ 2004 లో ప్రారంభమైంది. నేడు ఇది ప్రపంచంలోనే అత్యధికంగా ఉపయోగించే యాప్‌గా మారింది. గతంలో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు పేమెంట్‌ సర్వీస్‌ను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సేవ భారతదేశంలో ప్రారంభం కాలేదు. ఇప్పుడు ప్రజలు డబ్బు చెల్లించడం ద్వారా FB, Insta లలో బ్లూ టిక్ పొందవచ్చు.

ఇది కూడా చదవండి: Google: గూగుల్ నుంచి కీలక అప్‌డేట్‌.. ఇక నుంచి ఆ వివరాలు తొలగించడం సులభం!

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి