Twitter Down : ట్విట్టర్ సేవలకు అంతరాయం.. సరిగా పనిచేయడం లేదని వినియోగదారుల ఆందోళన..

Twitter Down : గత కొన్ని నెలలుగా కేంద్రానికి, ట్విట్టర్‌కి మధ్య వివాదం నడుస్తు్న సంగతి తెలిసిందే. దీంతో ట్విట్టర్ వినియోగదారుల సమస్యలు పెరిగిపోయాయి.

Twitter Down : ట్విట్టర్ సేవలకు అంతరాయం.. సరిగా పనిచేయడం లేదని వినియోగదారుల ఆందోళన..
Ttwitter Down

Updated on: Jul 01, 2021 | 11:34 AM

Twitter Down : గత కొన్ని నెలలుగా కేంద్రానికి, ట్విట్టర్‌కి మధ్య వివాదం నడుస్తు్న సంగతి తెలిసిందే. దీంతో ట్విట్టర్ వినియోగదారుల సమస్యలు పెరిగిపోయాయి. తాజాగా గురువారం కొద్దిసేపు ట్విట్టర్ సేవలకు ఆటంకం కలిగింది. ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ వినియోగదారులు ట్విట్టర్‌ను ఉపయోగించలేకపోయారు. డౌన్‌డెటెక్టర్ ప్రకారం 6000 మందికి పైగా వినియోగదారులు ఇటువంటి సమస్యను ఎదుర్కొన్నారు. దీంతో ‘ట్విటర్‌ డౌన్‌’ అంటూ వినియోగదారుల వ్యక్తిగత ఖాతాల్లో సందేశాలు వెల్లువెత్తాయి. ట్విటర్ వేదికగా సందేశాలు పంపించేందుకు, చూసేందుకు అంతరాయం కలిగినట్లు నెటిజన్లు వెల్లడించారు.

కొందరు తమ టైమ్‌లైన్‌ను వీక్షించడం సాధ్యంకాలేదని చెప్పగా.. మరికొందరు తమ పర్సనల్‌ కంప్యూటర్లలో ట్విటర్‌ను యాక్సెస్ చేయడం వీలుకాలేదన్నారు. మొబైల్‌ ఫోన్లలో ఈ సమస్య ఎదురుకానట్లు తెలుస్తోంది. మరోపక్క తాము సమస్యను పరిష్కరిస్తున్నట్టు ట్విటర్ వినియోగదారులకు సమాచారం ఇచ్చింది. 80 శాతం మంది వినియోగదారులకు ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో ఈ సమస్య ఎదురైనట్లు అవుటేజ్‌ మానిటరింగ్‌ వెబ్‌సైట్‌ డౌన్‌డిటెక్టర్ నివేదిక వెల్లడించింది. ఒక గంటపాటు ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. అలాగే భారత్‌తో పాటు చాలా దేశాలు ప్రభావితమైనట్లు సమాచారం.

అంతకుముందు ప్రొఫైల్ చూడలేకపోయిన వారు ఇప్పుడు చూడగలరని ట్విట్టర్ సపోర్ట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రొఫైల్ లోడింగ్ సమస్య పరిష్కారించామన్నారు. అయితే థ్రెడ్ అప్‌లోడ్, ఇతర సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయి. దీనిపై సహాయక బృందం పనిచేస్తోందని త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని కంపెనీ తెలిపింది. గత కొన్ని నెలలుగా ట్విట్టర్ వివాదాలు ఎదుర్కొంటుంది. ఇటీవల జమ్మూ కాశ్మీర్, లడఖ్లను దాని వెబ్‌సైట్‌లో ప్రత్యేక దేశాలుగా చూపించారు. ‘ట్వీప్ లైఫ్’ విభాగంలో చూపిన మ్యాప్ జమ్మూ కాశ్మీర్, లడఖ్ భారతదేశం నుంచి వేరుగా ఉన్నట్లు చూపిస్తుంది. ఇలా చేసినందుకు భారత ప్రభుత్వం ట్విట్టర్‌పై కఠినమైన చర్యలు తీసుకోవచ్చు.

Small Saving Schemes: గుడ్ న్యూస్.. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం..!

National Doctors Day-2021: డాక్టర్స్‌ డే ఎందుకు జరుపుకుంటారు..! దాని వెనకున్న చరిత్ర ఏంటి.. తెలుసుకోండి..

National Doctor’s Day: సాయి పల్లవి.. అజ్మల్ అమీర్‏ సహా నిజ జీవితంలో డాక్టర్స్ అయిన స్టార్స్..