
ఈ మధ్యకాలంలో సైబర్ నేరుగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా కొత్త జిమ్మిక్కులతో వారి వద్ద నుంచి డబ్బులు కొల్లగొట్టేందుకు చూస్తున్నారు. ఈ క్రమంలోనే పాత రూపాయి, రెండు రూపాయిల నోట్లు మీ దగ్గర ఉంటే వాటిని కొంటాం అంటూ మెసేజ్‌లు పంపుతున్నారు. వాటికి బదులుగా మీకు వేలు, లక్షల్లో డబ్బు ఇస్తామంటూ అందులో పేర్కొంటున్నారు.
వాట్సాప్‌లో వచ్చే ఈ ఫేక్ మెసేజ్‌లను నిజం అనుకొని కొంతమంది తమ వద్ద ఉన్న పాత నోట్లకు బదులుగా వేల రూపాయలు వస్తాయని ఆశపడుతున్నారు. వెంటనే అందులో ఉన్న నంబర్లకు కాల్ చేసి, మా వద్ద పాత రూపాయి, రెండు రూపాయల నోట్లు ఉన్నాయని ఎంతకు కొంటారని అడుగుతున్నారు. అయితే అటు నుంచి సైబర్ మోసగాళ్లు.. ఆ నోటును ఫొటో తీసి వాట్సాప్‌లో పంపమని అడుగుతారు.
ఆ ఫొటోను పంపిన వెంటనే.. అది ఎంతో విలువైనదిగా చెబుతూ దాన్ని తమకే అమ్మలాని, అవసరం అయితే లక్ష రూపాయాలు అయినా ఇస్తామంటూ ఆశ పుట్టిస్తారు. అయితే ఆ నోటు కొనాలంటే ముందు మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ నంబర్లు, ఫొటోలు పంపాలని ఆడుతున్నారు. లక్షలు వస్తున్నాయనే ఆశతో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ పంపిన తర్వాత.. ఓటీపీలు కూడా ఆడిగి తెలుసుకొని.. వాటితో ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారు. ఇలా చాలా మంది ఇప్పటికే మోసపోయారు. ఇలాంటి మెసేజ్‌లు మీకు కూడా వస్తే నమ్మకండి. జాగ్రత్తగా ఉండండి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి