AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూపర్‌‌ప్లాన్ వేసిన హోండా..! ఇండియన్‌ మోటార్‌‌సైకిల్‌ మార్కెట్‌ను ఎలా మార్చేస్తోందో తెలుసా

Honda.. ప్రపంచ మోటార్‌సైకిల్ రంగంలో భారత్‌కు అత్యంత ప్రాధాన్యత కల్పించేందుకు ప్రముఖ ఆటో దిగ్గజం హోండా భారీ ప్రణాళికలు రచిస్తోంది. ఎగుమతులు పెంచడం, ఎలక్ట్రిక్ వాహనాల తయారీని విస్తరించడం లక్ష్యంగా సాగుతున్న ఈ సంస్థ అడుగులు ఆటోమొబైల్ మార్కెట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

సూపర్‌‌ప్లాన్ వేసిన హోండా..! ఇండియన్‌ మోటార్‌‌సైకిల్‌ మార్కెట్‌ను ఎలా మార్చేస్తోందో తెలుసా
Hondas New Strategy To Make India A Global Manufacturing Hub For Motorcycles And Evs
Nikhil
|

Updated on: Aug 04, 2026 | 6:40 AM

Share

దేశీయ మార్కెట్‌ను ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా మార్చాలనే దృఢ సంకల్పంతో హోండా సంస్థ అడుగులు వేస్తోంది. సరికొత్త ఎలక్ట్రిక్ మోడళ్లు, ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత, భారీ ఎగుమతుల లక్ష్యంతో దూసుకెళ్తున్న ఈ జపాన్ బ్రాండ్ భవిష్యత్తు ప్రణాళికల గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం!

భారీ పెట్టుబడులు..

ప్రపంచ మోటార్‌సైకిల్ మార్కెట్‌లో భారత్‌కు మరింత కీలక స్థానం కల్పించాలనే లక్ష్యంతో హోండా కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లను కూడా దృష్టిలో పెట్టుకుని కంపెనీ భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. కొత్త టూవీలర్స్, ఎలక్ట్రిక్ మోడళ్లు, ఫ్లెక్స్ ఫ్యూయల్ బైకులు, ప్రీమియం మోటార్‌సైకిళ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించింది.

ఇటీవల హోండా భారత్‌లో తయారు చేసిన పది కొత్త ఉత్పత్తులను ప్రదర్శించింది. అయితే ఇది కేవలం కొత్త మోడళ్ల పరిచయానికే పరిమితం కాకుండా, దేశాన్ని గ్లోబల్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా పెద్ద ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్ అనే లక్ష్యంతో భారత్‌లో తయారైన వాహనాలను ప్రపంచంలోని మరిన్ని దేశాలకు ఎగుమతి చేయాలని కంపెనీ భావిస్తోంది.

ఈ ప్రణాళికలో భాగంగా భారత్‌లో మరింత ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, విడిభాగాల స్థానిక తయారీని ప్రోత్సహించడం, ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని విస్తరించడం లాంటి అంశాలపై హోండా దృష్టి సారిస్తోంది. దేశీయంగా తయారయ్యే వాహనాల నాణ్యత మరింత మెరుగుపడటంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా పోటీ సామర్థ్యం పెరుగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. ఎగుమతుల విషయంలోనూ హోండా అద్భుతమైన సత్తా చాటుతోంది.

2023-24 ఆర్థిక సంవత్సరంలో సుమారు 3.6 లక్షల టూ వీలర్స్‌ను విదేశాలకు ఎగుమతి చేసిన సంస్థ, 2025-26 నాటికి ఆ సంఖ్యను 6.2 లక్షల యూనిట్లకు పెంచింది. రాబోయే రోజుల్లో భారత్‌లో తయారయ్యే మరిన్ని మోడళ్లను విదేశీ మార్కెట్లలోకి తీసుకెళ్లడం ద్వారా ఈ వృద్ధిని అలాగే కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రత్యేక దృష్టి

అంతేకాదు భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త మోడల్స్‌ను తీసుకురావాలని భావిస్తోంది. ప్రస్తుతం ఎక్కువ మంది ప్రీమియం మోటార్‌సైకిళ్లు, అధిక సామర్థ్యం కలిగిన ఇంజిన్లతో వచ్చే బైకులు, అడ్వెంచర్, లైఫ్‌స్టైల్ మోడళ్లపై ఆసక్తి చూపుతున్నారు. దీనికి అనుగుణంగా కొత్త వెహికల్స్‌ను మార్కెట్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇక భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా హోండా మరింత దృష్టి పెట్టనుంది. పర్యావరణహిత సాంకేతికతలకు అనుగుణంగా ఎలక్ట్రిక్ టూవీలర్స్, ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో కూడిన మోడళ్లను అభివృద్ధి చేయడానికి పెట్టుబడులు పెంచుతోంది. దీంతో వినియోగదారులకు మరిన్ని కొత్త మోడల్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

భారత్‌ను కేవలం పెద్ద మార్కెట్‌గా కాకుండా, ప్రపంచానికి వాహనాలను సరఫరా చేసే ప్రధాన తయారీ కేంద్రంగా మార్చాలనే లక్ష్యంతో హోండా ముందుకు సాగుతోంది. కొత్త మోడల్స్, పెరుగుతున్న ఎగుమతులు, స్థానిక తయారీ విస్తరణ, ఎలక్ట్రిక్, ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీలపై పెట్టుబడులతో రానున్న రోజుల్లో భారత మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని కంపెనీ భావిస్తోంది. ఆటోమొబైల్ రంగంలో మారుతున్న కాలానికి తగినట్లుగా అడుగులు వేస్తున్న ఈ జపాన్ దిగ్గజ సంస్థ భవిష్యత్తులో మరింత సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Follow Us
గజకేసరి యోగంతో ఈ 4 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి!
గజకేసరి యోగంతో ఈ 4 రాశులకు ధనలాభం, కెరీర్‌లో పురోగతి!
కాళ్లు పైకి, మొండెం కిందికి కుర్చీపై తలకిందులుగా పోలీస్ అధికారి..
కాళ్లు పైకి, మొండెం కిందికి కుర్చీపై తలకిందులుగా పోలీస్ అధికారి..
స్వదేశీ ఉత్పత్తులను ఆదరించి.. చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోండి
స్వదేశీ ఉత్పత్తులను ఆదరించి.. చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోండి
ఫస్ట్ నైట్ రోజే భర్త చనిపోయి తిరిగి వస్తే..
ఫస్ట్ నైట్ రోజే భర్త చనిపోయి తిరిగి వస్తే..
అద్దంలో చూస్తూ రైఫిల్‌తో పర్ఫెక్ట్ షాట్.. ఈ మహిళ గురి చూస్తే వావ్
అద్దంలో చూస్తూ రైఫిల్‌తో పర్ఫెక్ట్ షాట్.. ఈ మహిళ గురి చూస్తే వావ్
వార ఫలాలు: అక్టోబర్ చివరివారంలో అదృష్టం పట్టే ఆ 4 రాశులివే..!
వార ఫలాలు: అక్టోబర్ చివరివారంలో అదృష్టం పట్టే ఆ 4 రాశులివే..!
కోజాగరి పౌర్ణమి రాత్రి ఈ 5 ప్రదేశాల్లో దీపాలు వెలిగించండి!
కోజాగరి పౌర్ణమి రాత్రి ఈ 5 ప్రదేశాల్లో దీపాలు వెలిగించండి!
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగలాంటి వార్త.. రూ.7,500కి పెంపు..!
పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి పండుగలాంటి వార్త.. రూ.7,500కి పెంపు..!
మాదకద్రవ్యాల శవపేటికలో చివరి మేకు దిగే వరకు పోరాటం ఆగదు: అమిత్‌షా
మాదకద్రవ్యాల శవపేటికలో చివరి మేకు దిగే వరకు పోరాటం ఆగదు: అమిత్‌షా
ఆ సినిమాను బ్యాన్ చేయండి.. వివాదం రేపిన టీజర్..
ఆ సినిమాను బ్యాన్ చేయండి.. వివాదం రేపిన టీజర్..