త్వరలో ‘చింగారీ’లో కొత్త హంగులు

చైనాకు చెందిన టిక్‌టాక్‌ యాప్ నిషేధం తరువాత దేశీ యాప్‌ చింగారీ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్లేస్టోర్‌లోకి వచ్చిన 22 రోజుల్లోనే ఈ యాప్‌ని కోటి మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే ఇందులో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చింగారి యాప్‌లో భారీ మార్పులు చేయబోతున్నట్లు ఆ సంస్థ సహవ్యవస్థాపకుడు సుమిత్‌ ఘోష్ సోమవారం వెల్లడించారు. యూఎక్స్‌, బగ్స్‌ మొదలు అన్ని రకాలుగా యాప్‌ను మార్చబోతున్నట్లు ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు. దీని కోసం […]

త్వరలో చింగారీలో కొత్త హంగులు

Edited By:

Updated on: Jul 06, 2020 | 1:12 PM

చైనాకు చెందిన టిక్‌టాక్‌ యాప్ నిషేధం తరువాత దేశీ యాప్‌ చింగారీ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్లేస్టోర్‌లోకి వచ్చిన 22 రోజుల్లోనే ఈ యాప్‌ని కోటి మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే ఇందులో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో చింగారి యాప్‌లో భారీ మార్పులు చేయబోతున్నట్లు ఆ సంస్థ సహవ్యవస్థాపకుడు సుమిత్‌ ఘోష్ సోమవారం వెల్లడించారు. యూఎక్స్‌, బగ్స్‌ మొదలు అన్ని రకాలుగా యాప్‌ను మార్చబోతున్నట్లు ఆయన ట్విట్టర్‌లో వెల్లడించారు. దీని కోసం తమ టీమ్​ రేయింబవళ్లు కష్టపడుతోందని ఆయన అన్నారు.

ఇక తమ యాప్‌కి ఇంత రెస్పాన్స్​ వస్తుందని తాము ఊహించలేదని సుమిత్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమ యాప్‌లో వీడియోలు, ఒక నిమిషం నిడివి కలిగిన న్యూస్ బులెటిన్‌కి మాత్రమే అనుమతిస్తున్నామని ఆయన వెల్లడించారు. కాగా చైనాకు చెందిన 59 యాప్‌ల నిషేధం తరువాత వాటికి ప్రత్యామ్నాయంగా ఉన్న స్వదేశీ యాప్‌లను డౌన్‌లోడ్ అందరూ‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో చింగారీతో పాటు రొపోసో, బోలో ఇండ్యా, మోజ్​ వంటి పలు యాప్‌లకు మంచి డిమాండ్‌ ఏర్పడిన విషయం తెలిసిందే.