Xiaomi New Technology: మ‌రో అద్భుతానికి తెర తీసిన షియోమీ.. ఇక‌పై సౌండ్‌తో మొబైల్ ఫోన్ ఛార్జింగ్‌..

|

Jun 25, 2021 | 9:55 PM

Xiaomi New Technology: టెక్నాల‌జీ రంగంలో ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌లు తీసుకొస్తూ త‌న‌దైన పంథాలో దూసుకుపోతుంది చైనాకు చెందిన ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం షియోమీ. స్మార్ట్ ఫోన్ త‌యారీలో విప్ల‌వం...

Xiaomi New Technology: మ‌రో అద్భుతానికి తెర తీసిన షియోమీ.. ఇక‌పై సౌండ్‌తో మొబైల్ ఫోన్ ఛార్జింగ్‌..
Xiaomi Sound Charging
Follow us on

Xiaomi New Technology: టెక్నాల‌జీ రంగంలో ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌లు తీసుకొస్తూ త‌న‌దైన పంథాలో దూసుకుపోతుంది చైనాకు చెందిన ప్ర‌ముఖ టెక్ దిగ్గ‌జం షియోమీ. స్మార్ట్ ఫోన్ త‌యారీలో విప్ల‌వం సృష్టించిన షియోమీ ఇత‌ర సాంకేతిక అంశాల విషయంలోనూ అద్భుత ఆవిష్క‌ర‌ణ‌ల‌కు తెర తీస్తోంది. ఇప్ప‌టికే వైర్‌లైన్ ఛార్జింగ్ టెక్నాల‌జీని అభివృద్ధి చేసే ప‌నిలో ప‌డింది షియోమీ. అంతేకాకుండా అత్యంత వేగంగా ఛార్జింగ్ అయ్యే 200 వాట్ ఛార్జ‌ర్‌ను అభివృద్ధి చేసింది.

ఇదిలా ఉంటే షియోమీ తాజాగా మ‌రో అద్భుతానికి నాందిప‌ల‌క‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. ఛార్జింగ్ టెక్నాల‌జీలో మ‌రో ముంద‌డుగు వేసి ధ్వ‌నితో ఛార్జింగ్ అయ్యే టెక్నాల‌జీని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ క్ర‌మంలోనే సౌండ్ ఛార్జింగ్ టెక్నాల‌జీకి సంబంధించి పేటెంట్ కోసం షియోమీ పేటెంట్ దాఖ‌లు చేసిన‌ట్లు తెలుస్తోంది. గిజ్ చైనా నివేదిక ప్రకారం, షియోమీ రాష్ట్ర సంస్థ చైనా నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అడ్మినిస్ట్రేషన్ కు పేటెంట్ కోసం దరఖాస్తు చేసిన‌ట్లు స‌మాచారం. ఈ టెక్నాల‌జీ ద్వారా ధ్వ‌ని ద్వారా ఛార్జ్ చేయ‌డానికి ప‌రిశోధ‌న‌లు జ‌రుపుతున్నారు. ఈ స‌రికొత్త సాంకేతిక‌త అందుబాటులోకి వ‌స్తే మొబైల్ రంగంలో పెను మార్పులు వ‌చ్చిన‌ట్లే అని టెక్ నిపుణులు చెబుతున్నారు.

Also Read: Batuk Bhairav Mandir: అక్కడ శివుడుకి పిల్లలు బిస్కెట్లు, చాక్లెట్లు సమర్పిస్తే.. పెద్దవారు మద్యం, మాంసం నైవేద్యం..

RGV: మ‌రో హారర్‌ మూవీ చేయ‌నున్న సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు.. అగ్ర హీరోతో భ‌య‌పెట్టించ‌నున్న వ‌ర్మ‌..

JioPhone Next Features:  రిలయన్స్ అందిస్తున్న తక్కువ ధరలో స్మార్ట్  ఫోన్..జియోఫోన్ నెక్ట్స్ ఫీచర్లు ఇలా ఉండొచ్చు!