ఛార్జింగ్ కష్టాలకు గుడ్ బై.. అన్నింటికీ ఒకే కేబుల్.. రాత్రుల్లో లైటింగ్ కూడా..

ఇకపై ఛార్జింగ్ కష్టాలు తప్పనున్నాయి. వేర్వేరు అవసరాల కోసం వివిధ రకాల కేబుల్స్ వాడాల్సిన అవసరం లేదు. ఒకే పరికరం ద్వారా ఒకే కేబుల్‌తో చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ మేరకు మోజెన్ సంస్థ ఫ్లో ఇగ్నైట్, నోమాడ్ అనే రెండు రకాల కేబుల్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ఛార్జింగ్ కష్టాలకు గుడ్ బై.. అన్నింటికీ ఒకే కేబుల్.. రాత్రుల్లో లైటింగ్ కూడా..
Amkette Mozen Cables

Updated on: Nov 05, 2026 | 12:06 PM

మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ డివైస్‌లు వాడేవారికి గుడ్ న్యూస్. ఇక చార్జింగ్ కష్టాలు తప్పనున్నాయి. వేర్వేరు అవసరాలకు వేర్వురు కేబుళ్లను తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ప్రయాణాలు చేసేటప్పుడు ఛార్జింగ్ కేబుల్స్ లేక చాలామంది ఇబ్బందులకు గురవుతుంటారు. ఒక డివైస్‌కు ఒక కేబుల్ అవసరమైతే.. మరో పరికరానికి మరో రకం కేబుల్ ఉపయోగించాల్సి ఉంటుది. ఇప్పటినుంచి అలాంటి కష్టాలు ఇక ఉండవు. అమ్‌కెట్ మోజెన్ సంస్థ ఫ్లో ఇగ్నైట్, నోమాడ్ అనే రెండు రకాల కేబుల్స్‌ను విడుదల చేసింది. రోజువారీ అవసరాలు, ప్రయాణాల్లో చార్జింగ్ కోసం ఇబ్బందులు పడకుండా అదనపు ఫీచర్లను జోడిస్తూ రెండు వేరియంట్లలో కొత్త చార్జర్లను విడుదల చేసింది. వీటి ధర కూడా చాలా తక్కువగా ఉంది.

టార్చ్, లైటర్ కూడా ఇందులోనే..

మోజెన్ ఫ్లో ఇగ్నైట్ ధర రూ. 799గా ఉండగా.. ఇందులో అనేక ఫీచర్లు ఉన్నాయి. USB-C నుండి USB-C కేబుల్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ లైటర్, టార్చ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఈ కేబుల్‌కు 100W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌ సదపాయం ఉంది. ఇది PD, QC, SCP, AVS ఛార్జింగ్ ప్రోటోకాల్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ ప్రొడక్ట్‌లో అంతర్నిర్మితంగా ఉన్న లైటర్‌ను కొవ్వొత్తులు వెలిగించడానికి ఉపయోగించవచ్చు. విద్యుత్ కోతలు, క్యాంపింగ్ ప్రయాణాలు, ఇతర తక్కువ కాంతి పరిస్థితులలో టార్చ్ వెలుగును కూడా ఇది అందిస్తుంది. ఇందుకోసం ఇందులో ఒక టార్చ్ మరియు లైటర్ ఉంటాయి.

వేర్వేరు కేబుళ్లు అక్కర్లేదు..

ఇక రెండో వేరియంట్ మోజెన్ ఫ్లో నోమాడ్ ధర రూ. 1,099గా నిర్ణయించారు. ప్రయాణాల సమయంలో ఛార్జింగ్ కేబుల్‌ను సులభంగా అందుబాటులో ఉంచుకోవడానికి వీలుగా ల్యాన్యార్డ్ డిజైన్ ఫీచర్ ఇందులో ఉంది. ఈ కేబుల్‌లో USB-A, USB-C, లైట్నింగ్ కనెక్టర్లు కలిసి ఉన్నాయి. దీనివల్ల వేర్వేరు కేబుళ్లను తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా పరికరాలను కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది మూడు కనెక్టర్ రకాలకు మద్దతు ఇస్తుంది. మోజెన్ ఫ్లో ఇగ్నైట్, నోమాడ్ 480Mbps వరకు డేటా బదిలీ వేగానికి మద్దతు ఇస్తాయి. వీటిని ఆమ్‌కెట్ అధికారిక వెబ్‌సైట్ లేదా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రయాణాలు చేసేవారితో పాటు కరెంట్ కోతల సమయంలో వెలుతురు కోసం ఇది ఉపయోగపడనుంది. ఒకే పరికరంలోనే విభిన్న రకాల ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌ మార్కెట్లోకి కూడా ఇవి అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఎవరైనా సులువుగా ఆన్ లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us