దేశంలోని అనేక ప్రాంతాలలో వేసవి కాలం వచ్చేసింది. ముఖ్యంగా ప్రాంతాలలో పగటిపూట ఉష్ణోగ్రత పెరగడం ప్రారంభమైంది. అటువంటి పరిస్థితిలో ప్రజలు వేడిని ఎదుర్కోవడానికి వివిధ జాగ్రత్తలు తీసుకుంటారు. మీరు కారు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమ్మర్ సీజన్‌లో మీ కారు ఇంజిన్ కూడా వేడెక్కవచ్చు. ఎందుకంటే వేడి కారణంగా కారు ఇంజిన్ వేడెక్కడం ప్రారంభమవుతుంది. అది చాలా వేడిగా ఉన్నప్పుడు కారు రోడ్డు మధ్యలో కూడా ఆగిపోతుంది. అందువల్ల వేసవిలో మీ కారును సురక్షితంగా ఉంచుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
- కారులో కూలెంట్: వేసవి కాలంలో కారు నడిపినప్పుడు ఇంజిన్ వేడెక్కుతుంది. దీని తరువాత ఇంజిన్ సీజ్ అయ్యే ప్రమాదం పెరుగుతుంది. కారు రిఫ్రిజెరాంట్ స్థాయిని నిర్వహించడం మీకు చాలా ముఖ్యం. కారులో కూలెంట్ స్థాయి బాగా ఉంటే, ఇంజిన్ త్వరగా వేడెక్కదు.
- ఇంజిన్ ఉష్ణోగ్రత: నేడు అందుబాటులో ఉన్న దాదాపు అన్ని కార్లలో గేజ్ వ్యవస్థ ఉంటుంది. ఇది కారు ఇంజిన్ ఉష్ణోగ్రతను కొలుస్తుంది. మీరు కారు నడుపుతూ మధ్యలో ఎక్కడో గేజ్ పై ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులకు లోనవుతున్నట్లు అనిపిస్తే, వెంటనే కారును పక్కన సురక్షితమైన ప్రదేశంలో ఆపి, కొంతసేపు చల్లబరచండి. మీరు వేడి ఇంజిన్‌తో కారు నడుపుతుంటే కారు ఆగిపోవచ్చు. దీని కారణంగా సమస్య తలెత్తే ప్రమాదం ఉంది.
- కార్ సర్వీసింగ్: కారు ఇంజిన్ దాని ప్రధాన భాగం. వేసవిలో ఎండలు మరింతగా ముదురకముందే మీరు మీ కారును సర్వీస్ చేయించుకోవాలి. సర్వీసింగ్ సమయంలో కారు ఇంజిన్, బ్రేక్‌లను తనిఖీ చేయడం అవసరం. ఇలా చేయడం వల్ల ఇంజిన్ సరిగ్గా పనిచేస్తుంది. అలాగే వేసవిలో త్వరగా వేడెక్కదు.
- ఇంజిన్ ఆయిల్: వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఇంజిన్ ఆయిల్ తక్కువ అవుతూ ఉంటుంది. మీ కారు ఇంజిన్ ఆయిల్ పాతదయితే ఈ సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే సరైన ఆయిల్ స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేయడం, అవసరమైనప్పుడు రీఫిల్ చేయడం చాలా ముఖ్యమంటున్నారు టెక్ నిపుణులు. అలాగే పవర్ స్టీరింగ్, బ్రేక్, ట్రాన్సమిషన్ ఫ్లూయిడ్ లెవల్స్ని తనిఖీ చేయాలి. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే బాగు చేయించడం ఉత్తమం.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి