WhatsApp: వాట్సప్‌లో కొత్త ఫీచర్.. క్యాప్షన్‌తో ఫోటోలు, వీడియోలను ఫార్వార్డ్ చేసుకోవచ్చు..

|

Oct 20, 2022 | 10:17 PM

మరింత ఫ్రెండ్లీగా మారబోతోంది వాట్సప్‌. ఫోటోలు, వీడియోలు, GIFలు, డాక్యుమెంట్‌లను ఫార్వార్డ్ లేదా షేర్ చేస్తున్నప్పుడు క్యాప్షన్‌లతోపాటు ఫార్వార్డ్ చేయవచ్చు. ఈ కొత్త అప్‌డేట్‌ను వాట్సాప్ బీటా అప్‌డేట్‌లో చూడవచ్చు.

WhatsApp: వాట్సప్‌లో కొత్త ఫీచర్.. క్యాప్షన్‌తో ఫోటోలు, వీడియోలను ఫార్వార్డ్ చేసుకోవచ్చు..
Whatsapp
Follow us on

వాట్సాప్ త్వరలో ఫార్వార్డింగ్ మెసేజ్‌లలో మెరుగుదలలను తీసుకురాబోతోంది. దీనిని ప్రస్తుతం వాట్సాప్ బీటా అప్‌డేట్‌లో చూడవచ్చు. దీని కింద వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలను ఫార్వార్డ్ చేస్తూ క్యాప్షన్‌లు రాసుకునే సదుపాయం ఉంటుంది. ప్రస్తుతం, మీరు ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసిన వాట్సాప్‌లో వీడియో లేదా ఫోటో మెసెజ్ ఫార్వార్డ్ చేసినప్పుడల్లా  మీరు దానితో క్యాప్షన్‌ను పంపలేరు. కానీ తాజాగా మార్చిన తర్వాత ఈ సమస్య పూర్తిగా మారిపోయింది. ఈ ఫీచర్‌ రావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఎందుకంటే ఈ ఫీచర్ ప్రస్తుతం డెబులపింగ్ స్టేజ్‌లో ఉంది. ఈ ఫీచర్‌కి సంబంధించిన తాజా నివేదికలో అందించిన సమాచారాన్ని మనం తెలుసుకుందాం.

వాట్సప్ రాబోయే ఫీచర్లను పర్యవేక్షించే Wabetainfo తాజా నివేదిక ప్రకారం, వాట్సప్ త్వరలో ఆన్రైడ్‌లో వాట్సప్ బీటా 2.22.23.4 అప్‌డేట్‌లో మొదటిసారిగా కనిపించిన ఆసక్తికరమైన ఫీచర్‌ను అప్‌డేట్ చేయబోతోంది. ఇప్పుడు వాట్సాప్‌లో ఫోటోలు, వీడియోలు, జీఏఎఫ్‌లు, డాక్యుమెంట్‌లను ఫార్వార్డ్ లేదా షేర్ చేయగలరని, అలాగే వాటి క్యాప్షన్‌లను ఫార్వార్డ్ చేయడం లేదా షేర్ చేయవచ్చని తాజా రిపోర్టులో తెలిపింది.

ఈ ఫీచర్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు కూడా నివేదికలో కనిపించాయి. అందులో వాట్సాప్ కొత్త ఇంటర్‌ఫేస్ కనిపించింది. ఈ ఫీచర్ పూర్తిగా అప్‌డేట్ చేయబడినప్పుడు. దీని కోసం అప్‌డేట్ చేయబడిన తర్వాత, ఏదైనా మీడియా ఫైల్‌ను దానికి సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసుకోవచ్చు. ఈ కాలమ్‌లో యూజర్లు తమ కాంటాక్ట్‌లకు ఫోటోలు, వీడియోలకు సంబంధించిన ఏదైనా టైటిల్స్ లేదా మెసెజ్‌ను పంపగలరు. యూజర్ల సందేశాన్ని శీర్షిక లేకుండా ఫార్వార్డ్ చేయాలనుకుంటే అది కూడా చేయవచ్చు.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూస్ కోసం