మెట్రో రైల్ మెట్లెక్కండి.. కేలరీలు తగ్గించుకోండి… కొత్త ప్లాన్ సూపర్!

| Edited By: Ram Naramaneni

Feb 24, 2020 | 9:30 PM

ఈ మధ్య అందరూ ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ కనబరుస్తున్నారు. వాకింగ్స్, జాగింగ్స్, వర్కవుట్లు అంటూ అందరూ జిమ్‌ల వెంట, పార్కుల వెంట పరుగెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాయింట్‌ని కనిపెట్టిన హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ తాజాగా ఓ వినూత్న ఐడియాకు..

మెట్రో రైల్ మెట్లెక్కండి.. కేలరీలు తగ్గించుకోండి... కొత్త ప్లాన్ సూపర్!
Follow us on

Hyderabad Metro Rail: ఈ మధ్య అందరూ ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ కనబరుస్తున్నారు. వాకింగ్స్, జాగింగ్స్, వర్కవుట్లు అంటూ అందరూ జిమ్‌ల వెంట, పార్కుల వెంట పరుగెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పాయింట్‌ని కనిపెట్టిన హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ తాజాగా ఓ వినూత్న ఐడియాకు తెరతీసింది. హైదరాబాదీలకు ఆరోగ్యంపై ఉన్న శ్రద్ధను.. కలర్ ఫుల్ కేలరీలుగా మార్చేసింది.

అసలు విషయం ఏంటంటే.. మెట్రో స్టేషన్‌లో స్టెప్స్‌ని మీరు గమనించే ఉంటారు. కానీ వాటిపై ప్రయాణికులు నడవడం చాలా తక్కువ. వేగంగా వెళ్లొచ్చని ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లని ఉపయోగిస్తున్నారు. నిజానికి వాటిని నడవలేని ముసలివాళ్లు, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు వాటిని అందరూ ఉపయోగించేస్తున్నారు. దీంతో మెట్లు ఎక్కితే ఎంత ఉపయోగమో.. తెలుపుతూ హైదరాబాద్ మెట్రో.. కొత్త ప్లాన్‌ని అమలు చేసింది. ప్రయాణికులను ఆకర్షితులుగా మార్చే విధంగా.. మెట్లపై కేలరీల విలువలు తెలుతూ రంగులు వేశారు.

ఫలితంగా ఎన్ని మెట్లు ఎక్కితే ఎన్ని కేలరీలు కరుగుతాయో తెలుసుకోవడానికి వీలవుతుంది. దీంతో ప్రయాణికులు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారు కేలరీలు తగ్గించుకోవడానికి ఇదో సులభమైన మార్గమని హైదరాబాద్ మెట్రో సంస్థ ట్వీట్ ద్వారా తెలిపారు. కాగా.. ఇప్పుడు ఇదే ప్లాన్‌ని నగరంలో ఉన్న అన్ని మెట్రో స్టేషన్లలోనూ అమలు పరిచేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.