BSNL Wi-Fi: మీ ఇంటి వైఫైని దేశంలో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు.. బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త సర్వీస్‌!

|

Nov 13, 2024 | 1:52 PM

BSNL Wi-Fi: ఇప్పటి వరకు BSNL FTTH వినియోగదారులు వారి రూటర్ పరిధిలో మాత్రమే ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయగలిగారు. కానీ ఇప్పుడు ఈ నేషనల్ వై-ఫై రోమింగ్ సర్వీస్ ద్వారా వినియోగదారులు తమ యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా BSNL నెట్‌వర్క్..

BSNL Wi-Fi: మీ ఇంటి వైఫైని దేశంలో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు.. బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త సర్వీస్‌!
Follow us on

బీఎస్ఎన్‌ఎల్‌ తమ వినియోగదారుల కోసం కొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రైవేట్‌ టెలికాం సంస్థలు టారీఫ్‌లను పెంచినప్పటికీ బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం ఎలాంటి ధరలు పెంచలేదు. దీంతో లక్షలాది ప్రైవేట్‌ టెలికాం కంపెనీల వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో 4G, 5G నెట్‌వర్క్‌ను తీసుకువచ్చేందుకు మరిన్ని చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ కంపెనీ తన జాతీయ Wi-Fi రోమింగ్ సేవను కూడా ప్రారంభించింది. ఇది BSNL FTTH (ఫైబర్-టు-ది-హోమ్) వినియోగదారులను భారతదేశం అంతటా BSNL నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ప్రస్తుతం.. BSNL FTTH కస్టమర్‌లు నిర్ణీత ప్రదేశంలో మాత్రమే హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని పొందనున్నారు. అయితే.. బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త జాతీయ Wi-Fi రోమింగ్ సేవలను పరిచయం చేయడంతో.. ఈ కస్టమర్లు త్వరలో భారతదేశంలో ఎక్కడి నుండైనా హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయగల సామర్థ్యాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ కొత్త సర్వీస్‌ ద్వారా బీఎస్ఎన్ఎల్ ఫైబర్ కనెక్షన్ వినియోగదారులు హై-స్పీడ్ FTTH నెట్‌వర్క్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ సదుపాయాన్ని పొందేందుకు వినియోగదారులు తప్పనిసరిగా బిఎస్ఎన్ఎల్ FTTH ప్లాన్‌ని కలిగి ఉండాలి.

ఇది కూడా చదవండి: MD Sajjanar: ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ హృదయాన్ని కదిలించిన అంధ యువకుని పాట.. కిరవాణి గారూ ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి!

ఈ సేవలను ఉపయోగించుకోవడం ఎలా?

బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు BSNL FTTH జాతీయ Wi-Fi రోమింగ్ సేవలను వినియోగించుకోవడానికి తప్పనిసరిగా బీఎస్‌ఎన్ఎల్‌ వెబ్‌సైట్‌లో https://portal.bsnl.in/ftth/wifiroaming లో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సమయంలో.. వినియోగదారులు ప్రాసెస్‌ పూర్తి చేసుకోవడానికి FTTH కనెక్షన్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. ఈ సేవలతో గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌ వైఫై కనెక్షన్ అందుబాటులో ఉన్నంత వరకు హై-స్పీడ్ ఇంటర్నెట్‌ని ఆస్వాదించవచ్చు.

Wi-Fi రోమింగ్ సర్వీస్‌ ప్రయోజనాలు:

ఇప్పటి వరకు BSNL FTTH వినియోగదారులు వారి రూటర్ పరిధిలో మాత్రమే ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయగలిగారు. కానీ ఇప్పుడు ఈ నేషనల్ వై-ఫై రోమింగ్ సర్వీస్ ద్వారా వినియోగదారులు తమ యాక్టివ్ సబ్‌స్క్రిప్షన్ ద్వారా BSNL నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రతిచోటా ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయవచ్చు. వినియోగదారు గ్రామీణ ప్రాంతంలో ఉన్నప్పటికీ, బీఎస్‌ఎన్‌ఎల్‌ Wi-Fi నెట్‌వర్క్ అక్కడ ఉన్నట్లయితే, వారు అక్కడ కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను పొందవచ్చు. బీఎస్‌ఎన్‌ఎల్‌ దాని వినియోగదారులు ప్రతిచోటా ఇంటర్నెట్‌ని ఉపయోగించుకునేలా వారికి ఒక పరిష్కారాన్ని అందించడానికి ఇది ప్రయత్నం.

ఇది కూడా చదవండి: Tech Tips: ఇంట్లో Wi-Fi స్పీడ్‌ తగ్గిందా? ఈ ట్రిక్స్‌తో మరింత వేగం!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి