Recharge Plan: కేవలం రోజుకు రూ.7తో 2.6జీబీ డేటా.. ఏడాది పాటు అన్‌లిమిటెడ్ కాల్స్.. ఈ అద్భుత ప్లాన్ ఎక్కడా చూసి ఉండరు..

బీఎస్‌ఎన్ఎల్ మరో కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. 365 రోజుల రీచార్జ్ ప్లాన్ తీసుకొచ్చింది. కేవలం రోజుకు రూ.7తో 2.6జీబీ పొందే అవకాశముంది. అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌ల సౌకర్యం ఉంది. ఈ ప్లాన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

Recharge Plan: కేవలం రోజుకు రూ.7తో 2.6జీబీ డేటా.. ఏడాది పాటు అన్‌లిమిటెడ్ కాల్స్.. ఈ అద్భుత ప్లాన్ ఎక్కడా చూసి ఉండరు..
Bsnl Plans

Updated on: Feb 08, 2026 | 5:34 PM

కేవలం రోజుకు రూ.7తో రోజుకు 2.6జీబీ డేటా పొందొచ్చు. ఏడాది పాటు ఆన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందుకోసం ప్రభుత్వరంగ టెలికాం సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్ అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దేశ్ కా నెట్‌వర్క్, దేశ్ కా భరోసా పేరుతో ప్రత్యేక ప్లాన్ ప్రవేశపెట్టింది. బీఎస్‌ఎన్‌ఎల్ భారత్ కనెక్ట్ 26 ప్లాన్ పేరుతో దీనిని లాంచ్ చేసింది. ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా రకరకాల ప్లాన్లను కస్టమర్ల కోసం తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్ కూడా ఈ ప్రత్యేక ప్లాన్ లాంచ్ చేసింది.

ప్లాన్ వివరాలు..

-ప్లాన్ ధర రూ.2626

-రోజుకు 2.6జీబీ డేటా

-అన్‌లిమిటెడ్ కాల్స్

-రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు

-365 రోజుల వ్యాలిడిటీ

-ఫిబ్రవరి 24 వరకు రీఛార్జ్ చేసుకుంటే ఆఫర్ వర్తిస్తుంది

-BEeX ఛాట్‌బాట్ నుంచి కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు

-ఒకేసారి 5జీ నెట్‌వర్క్ డేటా పొందవచ్చు

-2.6జీబీ రోజువారీ డేటా పూర్తయిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది

-ఒకేసారి రీఛార్జ్ చేసుకుంటే ఏడాదిపాటు అన్‌లిమిటెడ్ కాల్స్

-బీఎస్‌ఎన్‌ల్ సెల్ప్ కేర్ యాప్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు

-మరింత సమాచారం కోసం 1800-180-1503కు కాల్ చేయండి

బీఎస్ఎన్ఎల్ రూ. 2399 ప్లాన్

BSNL రూ. 2399 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఇది 365 రోజుల పాటు చెల్లుబాటు అవుతుంది. అంటే రోజుకు రూ. 6.57 మాత్రమే ఖర్చు అవుతుందన్నమాట. ఈ ప్లాన్‌లో రోజుకు 2.5GB డేటా పొందవచ్చు. ఇక ఏడాది పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అంటే ఏడాదిలో 912GB మొబైల్ డేటా వస్తుంది. ఇక రోజువారీ 2.5GB డేటా పూర్తైన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ 40Kbps కి పడిపోతుంది. అలాగే ఈ రీఛార్జ్ ప్లాన్‌లో రోజుకు 100 SMSలను పొందవచ్చు.