Infinix Zero Ultra: దేశంలోనే ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్ ఇదే! ఫీచర్లు చూస్తే మామూలుగా లేవు! ధర ఎంతంటే..

| Edited By: Anil kumar poka

Dec 22, 2022 | 11:50 AM

ఇదే కోవలో ఇన్‌ఫినిక్స్‌ జీరో అల్ట్రా 5జీ నెట్‌వర్క్‌తో దేశీయ మార్కెట్‌లోకి విడుదల వస్తోంది. 8 జీబీ/256 జీబీ కాన్ఫిగరేషన్‌తో.. కాస్‌లైట్‌ సిల్వర్‌, జెనిసిస్‌ నోయర్‌ రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది.

Infinix Zero Ultra: దేశంలోనే ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్ ఇదే! ఫీచర్లు చూస్తే మామూలుగా లేవు! ధర ఎంతంటే..
Infinix Zero Ultra 5g
Follow us on

స్మార్ట్‌ ఫోన్‌.. అరచేతిలో ఇమిడిపోయిన ఈ వస్తువు ప్రపంచాన్ని శాసిస్తోందనడం అతిశయోక్తి కాదెమో! ఇది లేనిదే మనిషికి పూట గడవని పరిస్థితి. అడుగుతీసి అడుగువేయలేని పరిస్థతి. దీనికి ఉన్న డిమాండ్‌ బట్టి కంపెనీలు వివిధ మోడళ్లలో ఫోన్‌లను రిలీజ్‌ చేస్తున్నాయి. ఇప్పుడు ట్రెండ్ అంతా 5జీ.  పలు దిగ్గజ కంపెనీలు ఇప్పటికే చాలా వేరియంట్లను 5జీలో లాంచ్‌ చేశాయి. ఇదే కోవలో ఇన్‌ఫినిక్స్‌ జీరో అల్ట్రా 5జీ నెట్‌వర్క్‌తో దేశీయ మార్కెట్‌లోకి విడుదల వస్తోంది. 8 జీబీ/256 జీబీ కాన్ఫిగరేషన్‌తో.. కాస్‌లైట్‌ సిల్వర్‌, జెనిసిస్‌ నోయర్‌ రంగుల్లో ఇది అందుబాటులో ఉండనుంది. డిసెంబర్‌ 25 నుంచి ఫ్లిప్‌ కార్ట్‌లో సేల్స్‌ ప్రారంభమయ్యే ఈ ఫోన్‌ ప్రారంభ ధర రూ. 29,999గా ఉంది.

ఫీచర్లు ఇవే.. 5జీ కనెక్టెవిటీతో వస్తున్న  ఇన్‌ఫినిక్స్‌ జీరో అల్ట్రా ఆండ్రాయిడ్‌ 12 XOSతో నిర్మితమవుతోంది. 6.8 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ అమోల్డ్‌ డిస్‌ప్లేతో పాటు ఫింగర్‌ ప్రింట్‌ లాక్‌ సిస్టమ్‌ను తీసుకొస్తోంది. అలాగే 200 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 13 ఎంపీ అల్ట్రా వైడ్‌, మరో 2 ఎంపీ డెప్త్‌ కెమెరా వస్తోంది. 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది.  4500mAh బ్యాటరీతో 180వాట్ల సామర్థ్యంతో ఇండియాలో ఫాస్టెస్ట్‌ చార్జింగ్‌ ఫోన్‌గా ఇది నిలిచిపోనుంది. కేవలం 12 నిమిషాల్లోనే ఇది 100 శాతం చార్జింగ్‌ పూర్తవుతుంది.

ఇన్‌ఫినిక్స్‌ జీరో 20..

అలాగే ఇన్‌ఫినిక్స్‌ జీరో 20 పేరిట మరో మోడల్‌ను కూడా తీసుకురానుంది. 4జీ కనెక్టెవిటీతో వచ్చే ఈ మోబైల్‌ 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజీ సామర్థ్యంతో అందుబాటులోకి రానుంది. గ్లిట్టర్‌ గోల్డ్‌, స్పేస్‌ గ్రే, గ్రీన్‌ ఫ్యాంటసీ రంగుల్లో డిసెంబర్‌ 28 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. దీని ధర రూ. 15, 999 గా ఉంది.

ఇవి కూడా చదవండి

ఫీచర్లు ఇవే.. హీలియో జీ99 చిప్‌, 4,500mAh బ్యాటరీ సామర్థ్యంతో 45 వాట్ల చార్జింగ్‌ వైర్‌ వస్తుంది. ఆండ్రాయిడ్‌ 12 సపోర్టుతో ఉండే ఈ ఫోన్ లో..  6.7 అంగుళాలతో కూడిన 90 Hz అమోల్డ్‌ స్క్రీన్‌ ఉంటుంది, దీనిలో ఫింగర్‌ ప్రింట్‌సెన్సార్‌ లేదు. 108 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 13 ఎంపీ అల్ట్రా వైడ్‌, 2 ఎంపీ డెప్త్‌ కెమెరాలు,  60 ఎంపీ సెల్ఫీ  కెమెరా ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..