యువత ఇటీవల కాలంలో స్మార్ట్ వాచ్‌లను ఎక్కువగా వాడుతున్నారు. అలాగే ఆరోగ్య సంబంధిత హెచ్చరికలు వస్తుండడంతో పెద్దవాళ్లు కూడా స్మార్ట్ వాచ్‌ల వాడుతున్నారు. గతంలో పురుషులు లేదా స్త్రీలు సమయం చూసుకోవడానికి కచ్చితంగా వాచ్‌ను ధరించే వారు. అయితే క్రమేపి ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు వాడకం పెరగడంతో టైమ్ కూడా అందులో చూసుకునే వెసులుబాటు ఉండడంతో వాచ్‌లు ధరించడం మానేశారు. అయితే ఇటీవల కాలంలో స్మార్ట్ వాచ్‌ల రాకతో వాచ్‌ల వినియోగం పెరిగింది. పెరిగిన వినియోగానికి అనుగుణంగా కంపెనీలు కూడా ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ బౌల్ట్ స్ట్రైకర్ పేరుతో సరికొత్త స్మార్ట్ వాచ్‌ను రిలీజ్ చేసింది. రూ.5999కే అందుబాటులో ఉన్న ఈ స్మార్ట్ వాచ్‌లో ఎన్నో ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయి. ఈ వాచ్ ప్రస్తుతం బౌల్ట్ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ సరికొత్త స్మార్ట్ వాచ్ కచ్చితంగా వినియోగదారులకు ఆకట్టుకుంటుందని బౌల్ట్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. స్ట్రైకర్ స్మార్ట్ వాచ్ ఫీచర్లు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..