boAt Wave Pro 47: బోట్‌ నుంచి అదిరిపోయే స్మార్ట్‌వాచ్‌.. క్రికెట్‌ స్కోర్‌ చూడవచ్చు.. ధర, ఫీచర్స్‌ వివరాలు

|

Mar 16, 2022 | 7:13 AM

boAt Wave Pro 47: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల లాగే స్మార్ట్‌వాచ్‌ల ట్రెండ్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌వాచ్‌లు విడుదలువుతున్నాయి. ..

boAt Wave Pro 47: బోట్‌ నుంచి అదిరిపోయే స్మార్ట్‌వాచ్‌.. క్రికెట్‌ స్కోర్‌ చూడవచ్చు.. ధర, ఫీచర్స్‌ వివరాలు
Boat Wave Pro 47
Follow us on

boAt Wave Pro 47: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ల లాగే స్మార్ట్‌వాచ్‌ల ట్రెండ్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం మార్కెట్లో సరికొత్త స్మార్ట్‌వాచ్‌లు విడుదలువుతున్నాయి. ఇక బోట్‌ తన మొట్టమొదటి మేడ్‌-ఇన్‌ ఇండియా స్మార్ట్‌వాచ్‌ (Smartwatch) బోట్‌ వేవ్‌ ప్రో47ను మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.3,199గా నిర్ణయించింది కంపెనీ. ఇందులో సరికొత్త ఫీచర్స్‌ను జోడించింది కంపెనీ. ఈ స్మార్ట్‌వాచ్‌లో టీమిండియా ఆడే క్రికెట్‌ మ్యాచ్‌లు, ఐపీఎల్‌ మ్యాచ్‌ల లైవ్‌ క్రికెట్‌ స్కోర్‌ చూసుకునే ఫీచర్‌ కూడా ఉంది. అలాగే హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు, స్పోర్ట్స్ మోడ్స్ కూడా ఇందులో ఉన్నాయి. boAt Wave Pro 47 స్మార్ట్‌వాచ్‌ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి.

boAt Wave Pro 47 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు:

ఈ వాచ్‌ సైజ్‌ 1.69 అంగుళాలు. హెచ్‌డీ కలర్‌ టచ్‌ డిస్‌ప్లేతో వస్తుంది. 500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ ఉంటుంది. అలాగే 100కు పైగా క్లౌడ్ బేస్ట్ వాచ్‌ ఫేసెస్ ఉంటాయి. ఇక బోట్ క్రెస్ట్ యాప్‌ (boAt Crest App)కు కనెక్ట్ చేసుకొని ఇష్టమైన ఫొటోను వాచ్‌ ఫేస్‌గా సెట్ చేసుకునే సదుపాయం ఉంది. ఇవే కాకుండా హార్ట్ రేట్ మానిటర్, టెంపరేచర్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ ఎస్‌పీఓ2 మానిటర్, స్లీప్ ట్రాకర్ లాంటి హెల్త్ ఫీచర్స్‌ వంటివి boAt Wave Pro 47లో ఉన్నాయి. ఇక వాకింగ్, రన్నింగ్, థ్రెడ్‌మిల్, ఇండోర్ సైక్లింగ్, క్రికెట్, బాక్సింగ్, బ్యాడ్మింటన్ సహా మరిన్ని స్పోర్ట్స్ మోడ్స్ వంటివి ఉన్నాయి. స్టెప్‌ కౌంట్‌ కూడా ఉంది.ఎంత దూరం నడిచామో, రోజుకు ఎన్ని క్యాలరీలు బర్న్ అయ్యాయి అనే విషయాలను ఆటోమేటిక్‌గా ఈ స్మార్ట్‌వాచ్‌ రికార్డు చేసుకుంటుంది.

స్మార్ట్‌ఫోన్‌లో బోట్ క్రెస్ట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకొని ఈ వివరాలను చూసే సదుపాయం ఉంది. అలాగే ఫోన్‌కు కనెక్ట్ చేసుకుంటే కాల్స్, మెసేజ్‌లు, సోషల్ మీడియా నోటిఫికేషన్లు వాచ్‌లో చూడవచ్చు. వాచ్‌లో హైడ్రేషన్ అలర్ట్ ఫీచర్ ఉంది. ఇది రోజులో నీరు తాగేందుకు యూజర్‌ను గుర్తు చేస్తుంటుంది. ఈ స్మార్ట్‌వాచ్‌ ఏడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌ వస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే వేగవంతమైన ఛార్జింగ్‌ సపోర్టును కూడా కలిగి ఉంది. ఇది స్మార్ట్ వాచ్‌ను 30 నిమిషాల్లో 0 శాతం నుండి 100 శాతానికి ఛార్జ్ చేసేలా ఫీచర్‌ ఉంది.

ఇవి కూడా చదవండి:

Realme GT Neo 3: రియల్‌మీ నుంచి అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. కేవలం ఐదు నిమిషాల్లో 50 శాతం ఛార్జ్‌

Wi-Fi Repeater: వైఫై రూటర్‌‌కు ధీటుగా Wi-Fi రిపీటర్.. అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని ఉందా..