60 గంటల బ్యాటరీ లైఫ్, పిచ్చెక్కించే ఫీచర్లతో నోట్ ఇయర్ బడ్స్.. ధర తెలిస్తే మతిపోతుంది
తక్కువ బడ్జెట్‌లో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కొనాలనుకునేవారికి మార్కెట్లో ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. అయితే ధరతో పాటు మంచి సౌండ్, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కోరుకునేవారికి boAt Airdopes Plus 224 ఆసక్తికరంగా కనిపిస్తోంది. రూ.999 ధరలో లభిస్తున్న ఈ మోడల్‌లో 13mm డ్రైవర్లు, Spatial Audio, Bluetooth 6.0 వంటి ఫీచర్లు ఉన్నాయి.

మ్యూజిక్ వినడం, సినిమాలు చూడటం, గేమ్స్ ఆడటంతో పాటు కాల్స్ మాట్లాడేందుకు ఇయర్‌బడ్స్ ఉపయోగించే వారికి కొన్ని ముఖ్యమైన ఫీచర్లు అవసరం. కొత్త మోడల్‌లో 60 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్, నాలుగు మైకులు, AI-ENx టెక్నాలజీ ఉన్నాయి. తక్కువ ధరలో రోజువారీ అవసరాలకు సరిపోయే ఇయర్‌బడ్స్ కోసం చూస్తున్న వారికి ఇది మరో ఎంపికగా నిలుస్తోంది.
13mm డ్రైవర్లతో సౌండ్..
ఈ ఇయర్‌బడ్స్‌లో 13mm డ్రైవర్లు ఇచ్చారు. ఇవి పాటల్లో బేస్, ట్రెబుల్ వంటి శబ్దాలను వినిపించేందుకు ఉపయోగపడతాయి. Spatial Audio సపోర్ట్ కారణంగా సినిమాలు, గేమ్స్ సమయంలో శబ్దం చుట్టూ నుంచి వస్తున్న అనుభూతి కలిగేలా చేస్తుంది. కాల్స్ కోసం నాలుగు మైకులు, AI-ENx టెక్నాలజీ ఉన్నాయి. బయట శబ్దం ఎక్కువగా ఉన్న సమయంలో బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను తగ్గించి అవతలి వ్యక్తికి గొంతు స్పష్టంగా వినిపించేలా ఈ టెక్నాలజీ పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.
60 గంటల బ్యాటరీ
కనెక్టివిటీ కోసం Bluetooth 6.0 సపోర్ట్ ఉంది. ఫోన్, ల్యాప్‌టాప్ వంటి పరికరాల మధ్య సులభంగా మారేందుకు మల్టీ-డివైస్ స్విచింగ్ ఫీచర్ కూడా ఉంది. boAt యాప్ ద్వారా టచ్ కంట్రోల్స్, ఈక్వలైజర్ సెట్టింగ్స్‌ను అవసరానికి తగ్గట్టు మార్చుకోవచ్చు.
బ్యాటరీ విషయానికి వస్తే ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 60 గంటల వరకు బ్యాకప్ ఇస్తుందని సంస్థ చెబుతోంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. Matte Black రంగులో లభించే ఈ మోడల్ ధర రూ.999గా ఉంది. రూ.1,000లోపు బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ, మంచి కనెక్టివిటీ, అదనపు సౌండ్ ఫీచర్లు కోరుకునేవారికి ఇది పరిశీలించదగిన ఆప్షన్.
