మనం వాడుతున్న మొబైల్ మనదే అయినా అందులో ఉండే సాఫ్ట్‌వేర్ అంతా విదేశాలతే. దీంతో దేశంలో టెక్నాలజీ మరింతగా పెరిగిపోతోంది. ముఖ్యంగా మొబైల్ రంగంలో కొత్త కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అయితే ఇప్పుడు సెల్ ఫోన్లలో వాడే ఆపరేటింగ్ సిస్టమ్‌ను స్వదేశీ పరిజ్ఞానంతో ఐఐటీ మద్రాస్ తయారు చేసింది. దీనికి భారత్ ఓఎస్ గా భారోస్ అనే పేరుతో ఆవిష్కరించారు. అయితే ఇప్పుడే ఇది మన మొబైల్ ఫోన్లలోకి రాదు. కానీ ప్రస్తుతం ఎంపిక చేసిన కంపెనీలు మాత్రమే దీన్ని వినియోగిస్తున్నాయి. ఆ తర్వాత అన్ని కంపెనీలకు అందుబాటులోకి రానుంది. దేశంలో సరికొత్త మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐఐటీ మద్రాస్ రూపొందించిన భారోస్ (BharOS)ను కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు పరీక్షించారు. వీడియో కాల్ ద్వారా ఆపరేటింగ్ సిస్టమ్ పనితీరు పరిశీలించారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్‌లు- ఆండ్రాయిడ్, ఐఓఎస్ లాగానే ఈ ఆపరేటింగ్ సిస్థం ఉంటుంది. భారతదేశం త్వరలో స్వదేశీ ‘ఆపరేటింగ్ సిస్టమ్’ను కలిగిన BharOSను విడుదల చేశారు. ఐఐటీ మద్రాస్‌లో అభివృద్ధి చేసిన భారతీయ ఆపరేటింగ్ సిస్టమ్ BharOS కోసం ఈ రోజు జరిగిన పరీక్షల్లో విజయవంతమైంది.
Release of Indigenous #Atmanirbhar Mobile Operating System, “BharOS” today. The Operating System has been developed by #IITMadras incubated firm J and K Ops Pvt. Ltd. For full video: https://t.co/uWKIddveqV #AtmanirbharBharat #MakeInIndia pic.twitter.com/Groj8tb7wK
— IIT Madras (@iitmadras) January 19, 2023
ఈ కొత్త ఓస్‌ను ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వీడియో కాల్ చేయడం ద్వారా పరీక్షించారు. భారతదేశ వ్యాప్తంగా వంద కోట్ల మొబైల్ వినియోగదారుల సమాచారాన్ని భద్రంగా ఉండేలా, సౌకర్యంగా వినియోగించుకునేలా ఉంటుందని ఐఐటీ మద్రాస్ వెల్లడించింది. ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేటర్ కు చెందిన జండ్-కె ఆపరేటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (జండ్ కాప్స్) సంస్థ దీన్ని రూపొందించింది. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వి.కామకోటి భారోస్ వివరాలు వెల్లడించారు. ఈ భారోస్ ఓఎస్ ను ప్రస్తుతానికి ఎంపిక చేసిన కంపెనీలకే ఇచ్చామని, త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. ఈ ఓఎస్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అత్యంత భద్రంగా ఉంచుతుందని జండ్ కాప్స్ సంస్థ డైరెక్టర్ కార్తీక్ అయ్యర్ అన్నారు.
ఈ ఓఎస్‌లో ఎలాంటి డీఫాల్డ్ యాప్స్ ఉండవు. యూజర్ తనకు నచ్చిన విధంగా, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే యాప్‌లను ఎంపిక చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. సాధారణంగా ఆండ్రాయిడ్, లేదా ఐఓఎస్‌లో కొన్ని యాప్‌లు డీఫాల్ట్‌గా వస్తుంటాయి. మొబైల్ వినియోగదారునికి వాటి అవసరం లేకుండా ఫోన్‌లోనే ఉండిపోతాయి. దీని వల్ల ఫోన్ మెమొరీపై భారం మరింతగా పడుతుంది. కానీ ఈ భారోస్‌లో డీఫాల్ట్ యాప్స్ లేకపోవడం వల్ల వినియోగదారునికి ఎక్కువ ఫోన్ మెమోరీ అందుబాటులో ఉంటుంది.
భారోస్ ఇన్‌స్టాల్ చేసుకున్న మొబైళ్లలో ప్రైవేట్ యాప్ స్టోర్ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. సురక్షితమైన, గోప్యతకు భంగం కలిగించని యాప్స్ మాత్రమే ఉంటాయి. వీటన్నింటిని అన్ని విధాలుగా పరీక్షించిన తర్వాత పాస్‌లోకి అనుమతి ఇస్తారు. సాధారణంగా ప్లేస్టోర్, యాప్‌స్టోర్‌లో ఉండే కొన్ని థర్డ్‌పార్టీ యాప్స్‌లు యూజర్ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తుంటాయి. కానీ ఈ భారోస్ పూర్తిగా సురక్షితమైనదిగా ఉంటుంది. సురక్షతమైన యాప్స్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఈ ఓఎస్‌కు సంబంధించి అప్‌డేట్స్ అన్ని కూడా నేటివ్ ఓవర్ ది ఎయిర్ (ఎన్‌ఓటీఏ) ద్వారానే వస్తాయని డెవలపర్స్ చెబుతున్నారు. అయితే దీని వల్ల యూజర్ ప్రమేయం లేకుండా ఓఎస్ అప్‌డేట్‌లు అన్ని కూడా ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అవుతాయి. మొబైల్ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండటం వల్ల ఫోన్‌లోని డేటా సురక్షితంగా ఉంటుందని డెవలపర్స్ చెబుతున్నారు.
భారోస్‌తో ఫోన్ బ్యాటరీ పనితీరు మరింత మెరుగవుతుందని జాండ్‌కె కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం యూజర్ల ఫోన్లలో ఉన్న ఓఎస్‌ల కంటే భారోస్‌తో బ్యాటరీ పనితీరు రెండు నుంచి మూడు రెట్లు పెరుగుతుందని వెల్లడించింది. ఎందుకంటే డీఫాల్ట్ యాప్స్ లేకపోవడం, యూజర్ తనకు అవసరమైన యాప్స్‌ను మాత్రమే ఇన్‌స్టాల్ చేసుకోవడం వల్ల బ్యాటరీపై భారం తగ్గుతుంది. దీని కారణంగా ఫోన్‌లోని బ్యాటరీ మరింతగా మెరుగవుతుందని చెబుతున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి