కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే

Best Eye-Care Computer Monitors.. ఉదయం నుంచి రాత్రి వరకు ల్యాప్‌టాప్ స్క్రీన్ ముందు గడిపే ఫ్రీలాన్సర్లకు కంటి సమస్యలు, తల నొప్పి సర్వసాధారణంగా మారుతుంటాయి. ఇలా రోజంతా స్క్రీన్‌ ముందు పనిచేయడం వల్ల కంటి చూపు దెబ్బతినే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రత్యేకమైన ఐ-కేర్ ఫీచర్లు ఉన్న మానిటర్లను ఉపయోగించడం చాలా ముఖ్యం.

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? ఈ విషయం తెలుసుకోవాల్సిందే
Best Eye Care Computer Monitors

Updated on: Aug 21, 2026 | 7:50 AM

బ్లూ లైట్ ఫిల్టర్, యాంటీ-గ్లేర్, ఫ్లికర్-ఫ్రీ టెక్నాలజీ ఉండే బెస్ట్ కంప్యూటర్ మానిటర్లు కళ్లకు ఎలాంటి ఒత్తిడి లేకుండా వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయి. లాంగ్ అవర్స్ పనిచేసే వారి కోసం మార్కెట్లో లభిస్తున్న టాప్ 5 ఐ-కేర్ కంప్యూటర్ మానిటర్ల ఫీచర్లు, ధరలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

టాప్ ఐ-కేర్ మానిటర్లు

ఫ్రీలాన్సర్ల కోసం బెస్ట్ బ్రాండ్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు బెన్‌క్యూ (BenQ). ఈ 27 అంగుళాల BenQ GW2790T మానిటర్ స్పెషల్ ఐ-కేర్ టెక్నాలజీతో వస్తుంది. ఇందులో ఉండే బ్రైట్‌నెస్ ఇంటెలిజెన్స్ ప్లస్ టెక్నాలజీ రూంలోని వెలుతురును బట్టి స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను వాటంతట అవే సర్దుబాటు చేసుకుంటుంది. దీని ధర రూ. 16,500 నుంచి రూ. 18,500 మధ్య ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ సమయం పనిచేసే వాళ్ల కోసం డెల్ బ్రాండ్ నుంచి Dell SE2725HM అద్భుతమైన ఆప్షన్.

100Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉండటం వల్ల స్క్రీన్ స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. దీని ధర రూ. 11,000 నుంచి రూ. 13,000 మధ్య ఉంది. హెచ్‌పీ (HP) సంస్థ నుంచి వచ్చిన 23.8 అంగుళాల HP Series 5 Pro మానిటర్ ఆఫీస్, ఫ్రీలాన్స్ వర్క్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఇందులో ఉన్న ఐ-ఈజ్ హార్డ్‌వేర్ బ్లూ లైట్ ఫిల్టర్ రంగుల క్వాలిటీ కోల్పోకుండానే హానికరమైన బ్లూ లైట్‌ను తగ్గిస్తుంది. దీని ధర రూ. 12,500 నుంచి రూ. 14,000 మధ్య ఉంటుంది.

ఇతర బెస్ట్ మానిటర్లు

తక్కువ ధరలో మంచి కలర్ ఆక్యూరసీ, ఐ-ప్రొటెక్షన్ కోరుకుంటే Acer EK220Q Ebi మంచి ఛాయిస్. ఇది 21.5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఫ్లికర్-ఫ్రీ టెక్నాలజీ ఉండటం వల్ల స్క్రీన్ బ్లింక్ అవ్వకుండా కళ్లకు ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. దీని ధర రూ. 7,500 నుంచి రూ. 9,000 మధ్య ఉంటుంది. ఇక సామ్‌సంగ్ ఎం5 స్మార్ట్ మానిటర్ కేవలం కంప్యూటర్ మానిటర్ మాత్రమే కాదు, ఇందులో స్మార్ట్ టీవీ ఫీచర్లు కూడా ఉంటాయి.

వర్క్ అయిపోయిన తర్వాత వినోదం కోసం కూడా దీన్ని వాడొచ్చు. అడాప్టివ్ పిక్చర్ టెక్నాలజీ ఆటోమేటిక్‌గా కాంతిని నియంత్రిస్తుంది. ఐ సేవర్ మోడ్, ఫ్లికర్ ఫ్రీ, బిల్ట్-ఇన్ స్పీకర్లు, ఓటీటీ యాప్స్ సపోర్ట్ దీని ప్రత్యేకతలు. దీని ధర రూ. 18,000 నుంచి రూ. 21,000 మధ్య ఉంటుంది. మీ అవసరాలు, బడ్జెట్ ఆధారంగా వీటిలో తగిన మానిటర్‌ను ఎంచుకోవడం ద్వారా కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us