Bajaj Pulsar: ఇప్పుడు బజాజ్ పల్సర్‌ సరికొత్త స్టైల్‌లో.. ధరలో ఎటువంటి మార్పు లేదు..!

| Edited By: Anil kumar poka

Mar 11, 2022 | 1:26 PM

Bajaj Pulsar: బజాజ్‌ పల్సర్‌ బైక్‌ చాలా ఫేమస్.. యువకులు చాలా ఇష్టపడుతారు. ఎందుకంటే కంపెనీ బైక్‌ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తుంది. పల్సర్ ప్రారంభించినప్పటి నుంచి

Bajaj Pulsar: ఇప్పుడు బజాజ్ పల్సర్‌ సరికొత్త స్టైల్‌లో.. ధరలో ఎటువంటి మార్పు లేదు..!
Bajaj Pulsar
Follow us on

Bajaj Pulsar: బజాజ్‌ పల్సర్‌ బైక్‌ చాలా ఫేమస్.. యువకులు చాలా ఇష్టపడుతారు. ఎందుకంటే కంపెనీ బైక్‌ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తుంది. పల్సర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు అనేక కొత్త మోడల్స్‌ని విడుదల చేసింది. తాజాగా పల్సర్ NS200, పల్సర్ RS200 బైక్‌లని స్టైలిష్ బ్లాక్ అల్లాయ్ వీల్స్‌తో అందించాలని నిర్ణయించింది. బజాజ్ ఈ మార్పునకు బదులుగా బైక్‌ల ధరలను పెంచలేదు. బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధరను రూ.1,34,195గా ఉంచగా, పల్సర్ ఆర్ఎస్200 ఎక్స్-షోరూమ్ ధర రూ.1,64,719గా నిర్ణయించారు. ఫిబ్రవరి 2022లోనే బజాజ్ ఆటో తన బైక్‌ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. అయితే గత రెండేళ్లలో ఈ రెండు బైక్‌లలో కంపెనీ ఎలాంటి మార్పులు చేయలేదు. రెండూ 199 cc సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో 24.5PS, 18.5Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి.

బజాజ్ నుంచి వచ్చిన ఈ రెండు బైక్‌లు ముందు వైపున టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపున మోనోషాక్ సస్పెన్షన్‌తో వచ్చాయి. కంపెనీ తన రెగ్యులర్ పల్సర్ సిరీస్‌లో కొంతకాలం క్రితం అనేక మార్పులు చేసింది. కాబట్టి త్వరలో పల్సర్ NS200, RS200 కూడా మార్పులు చేయనున్నట్లు సమాచారం. బజాజ్ ఆటో పల్సర్ సిరీస్‌లో అనేక మోడళ్లను విక్రయిస్తుంది. వీటిలో మొత్తం ఎనిమిది మోడల్స్ 125 సిసి నుంచి 220 సిసి ఇంజిన్లలో విక్రయాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు స్పోర్ట్స్‌ బైక్‌లోలో పల్సర్‌ నెంబర్ వన్ అని చెప్పవచ్చు. టూవీలర్ సెగ్మెంట్‌లో దీని మార్కెట్‌ చాలా పెద్దది. బజాజ్ ఆటో ఇప్పుడు తన ఈవీ ఉత్పత్తిని కూడా పెంచాలని యోచిస్తోంది. పూణే సమీపంలో సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాల ప్లాంట్ కోసం రూ. 300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ఇప్పటికే ప్రకటించింది . ఈ ప్లాంట్‌లలో బజాజ్‌ చేతక్‌ ఈవీ స్కూటర్లని సిద్దం చేస్తుంది.

Viral Video: బురదలో చిక్కుకున్న జేసీబీకి మరొక జేసీబీ హెల్ప్‌.. వైరల్‌ అవుతున్న వీడియో..

Viral Video: ఎండిపోయిన చెట్టుని అద్భుత బొమ్మగా మలిచిన తీరు అద్భుతం.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు..

ICC Women World Cup 2022: ప్రపంచకప్‌లో వెనుకబడుతున్న టీమ్‌ ఇండియా.. ఒకటి గెలుపు మరొకటి ఓటమి..