Asus Rog Ally Handheld: గేమర్స్‌కి గుడ్ న్యూస్.. అదిరే ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త హ్యాండ్ హెల్డ్ డివైజ్.. పూర్తి వివరాలు ఇవి..

ప్రముఖ టెక్ కంపెనీ అసుస్ సరికొత్త హ్యాండ్ హెల్డ్ ని పరిచయం చేసింది. దీని పేరు అసుస్ ROG Ally. దీనిలో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. అద్భుతమైన పనితీరు కనబరుస్తుంని కంపెనీ ప్రకటించింది. స్టీమ్ డెక్ హ్యాండ్ హెల్డ్ కి పోటీగా దీనిని అసుస్ తీసుకొచ్చింది.

Asus Rog Ally Handheld: గేమర్స్‌కి గుడ్ న్యూస్.. అదిరే ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త హ్యాండ్ హెల్డ్ డివైజ్.. పూర్తి వివరాలు ఇవి..
Asus Rog Ally

Updated on: Jul 13, 2023 | 4:30 PM

మీరు ఆన్ లైన్ గేమ్స్ ఎక్కువ ఆడతారా? మంచి గేమింగ్ హ్యాండ్ హెల్డ్ ఉంటే బాగుండు అని భావిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. ప్రముఖ టెక్ కంపెనీ అసుస్ సరికొత్త హ్యాండ్ హెల్డ్ డివైజ్ ని పరిచయం చేసింది. దీని పేరు అసుస్ ROG Ally. దీనిలో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. అద్భుతమైన పనితీరు కనబరుస్తుంని కంపెనీ ప్రకటించింది. స్టీమ్ డెక్ హ్యాండ్ హెల్డ్ కి పోటీగా దీనిని అసుస్ తీసుకొచ్చింది. దీనిలో 7 అంగుళాల ఎల్సీడీ ప్యానల్ ఉంటుంది. ఏఎండీ జెడ్1 ఎక్స్ ట్రీమ్ చిప్ సెట్ ఉంటుంది. ఇది విండోస్ కు సపోర్టు చేస్తుంది. స్టీమ్, ఎపిక్, ఎక్స్ బోక్స్ గేమ్ పాస్ దేనికైనా సపోర్టు చేస్తుంది. దీనిలో వినియోగదారులు ఏఏఏ గేమ్స్ ను ఆడవచ్చు.

ROG Ally డిస్ ప్లే వివరాలు.. ఈ హ్యాండ్ హెల్డ్ కన్సోల్ లో 7 అంగుళాల ఎల్సీడీ ప్యానల్ ఉంటుంది. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఫుడ్ హెచ్ డీ రిజల్యూషన్ ఉంటుంది. 500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంటుంది. డిస్ ప్లే సంరక్షణకు గొరిల్లా గ్లాస్ విక్టస్, గొరిల్లా గ్లాస్ డీఎక్స్ ఉంటాయి.

ROG Ally సామర్థ్యం.. ఈ అసుస్ హ్యాండ్ హెల్డ్ కన్సోల్ ఏఎండీ 4ఎన్ఎం జెడ్1 ఎక్స్ ట్రీమ్ ప్రాసెసర్ తో వస్తుంది. అలాగే ఏఎండీ ఆర్డీఎన్ఏ3 ఆన్ బోర్డు గ్రాఫిక్స్ ఉంటాయి. 4జీబీ వీర్యామ్ తో పాటు16జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్ కూడా ఉంటుంది. 512జీబీ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. దీనిలో రెండు స్పీకర్లు ఉంటాయి. అది కూడా డాల్డీ అట్మోస్ సర్టిఫికేషన్ తో ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ROG Ally కనెక్టివిటీ.. దీనిలోని మైక్రోఫోన్ ఏఐ ఆధారిత నాయిస్ క్యాన్సలేషన్ ను సపోర్టు చేస్తుంది. డీ ప్యాడ్, రెండు అనలాగ్ స్టిక్స్, నాలుగు ఫేస్ బటన్స్, ట్రిగ్గర్స్, బంపర్స్ ఉంటాయి. 3.5ఎంఎం హెడ్ ఫోన్ జాక్, టైప్ సీ పోర్టు, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ ఉంటుంది. 40 వాట్ అవర్ బ్యాటరీ ఉంటుంది. 65 వాట్ల చార్జింగ్ ని సపోర్టు చేస్తోంది. బ్లూటూ్ 5.2, వైఫై 6ఈ, 608 గ్రాముల బరువు ఉంటుంది.

ఇది అన్ని రకాల యాప్స్, గేమింగ్ ప్లాట్ ఫారంలను సపోర్టు చేస్తుంది. స్టీమ్, ఈఏ యాప్, ఎక్స్ బాక్స్ గేమ్ పాస్ అల్టీమేట్, పీసీ గేమ్ పాస్, ఎపిక్ గేమ్ స్టోర్, జీఓజీ గేలాక్సీ 2.0, ఆండ్రాయిడ్ యాప్స్, వివిధ గేమింగ్ ప్లాట్ ఫారంలను సపోర్టు చేస్తుంది.

ROG Ally ధర, లభ్యత.. అసుస్ కంపెనీ నుంచి వస్తున్న ఈ హ్యాండ్ హెల్డ్ ధర రూ. 69,990గా ఉంది. మరిన్ని ఆఫర్లు, ఇతర వివరాల కోసం అధికారిక వెబ్ సైట్లో సంప్రదించాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..