సునీతా-విల్ మోర్ భవితవ్యంపై ఈ రాత్రికి నాసా కీలక రివ్యూ… వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని భరోసా

|

Aug 24, 2024 | 11:43 AM

రోజు రోజుకీ భయాలు పెరిగిపోతున్నాయి. 8 రోజుల టూర్.. ఎప్పుడు తిరిగొస్తారో తెలియని స్థితికి చేరింది. దీంతో అన్ని రోజులు అంతరిక్షంలో ఉంటే తలెత్తే ఆరోగ్య సమస్యల గురించి రోజుకో కథనాలు వస్తున్నాయి.

సునీతా-విల్ మోర్ భవితవ్యంపై ఈ రాత్రికి నాసా కీలక రివ్యూ... వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని భరోసా
NASA on Butch Wilmore and Suni Williams
Image Credit source: NASA
Follow us on

రోజు రోజుకీ భయాలు పెరిగిపోతున్నాయి. 8 రోజుల టూర్.. ఎప్పుడు తిరిగొస్తారో తెలియని స్థితికి చేరింది. దీంతో అన్ని రోజులు అంతరిక్షంలో ఉంటే తలెత్తే ఆరోగ్య సమస్యల గురించి రోజుకో కథనాలు వస్తున్నాయి. గతంలో యూఎస్ మిలటరీ స్పేస్‌లో పని చేసిన శాస్త్రవేత్తల మాటలు వింటూ ఉంటే.. అసలు సునీత – విల్ మోర్ ఇద్దరూ భూమికి తిరిగొచ్చే అవకాశం ఉందా లేదా.. వారిపై ఆశలు వదులుకోవాల్సిందేనా అన్న సందేహాలు కలుగుతున్నాయి. తాజాగా గతంలో అమెరికా మిలటరీ స్పేస్ సిస్టమ్‌లో పని చేసిన రూడీ రిడాల్ఫీ తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తే వణుకుపుడుతోంది.

స్టార్ లైనర్ రీఎంట్రీ విషయంలో 3 ప్రమాదకర పరిణామాలు జరిగే అవకాశం ఉందని, ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు. నెంబర్ వన్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ సర్వీస్ మాడ్యూల్ ఎలైన్మెంట్ అత్యంత కీలకం అన్నది ఆయన మాట. ముఖ్యంగా స్పేస్ క్రాఫ్ట్ భూమికి సురక్షితంగా తిరిగి రావాలంటే సర్వీస్ మాడ్యూల్ సరిగ్గా అతుక్కోవాలని…క్యాప్సూల్‌ను సరైన కోణంలో అంటిపెట్టుకుంటేనే వారు సేఫ్‌గా భూమికి పైకి తిరిగి రాగలుగుతారని చెబుతున్నారు. మాడ్యూల్ కోణం ఏ మాత్రం సరిగ్గా లేకపోయినా అనేక దుష్పరిణామాలు జరిగే ప్రమాదం ఉందన్నది ఆయన మాట.

Butch Wilmore and Suni Williams

పరిమితంగానే ఆక్సిజన్
ఒక వేళ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ సరిగ్గా పని చేయకుండా అంతరిక్షంలోనే నిలిచిపోతే అప్పుడు అందులో కేవలం 96 గంటలకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే ఉంటుంది. అయితే ఈ పరిస్థితి కేవలం క్యాప్సూల్ సరైన యాంగిల్లో అతుక్కోకపోయినప్పుడు మాత్రమే తలెత్తే ప్రమాదం ఉంది. ఒక వేళ సరైన యాంగిల్లో అతుక్కోకపోతే భూవాతావరణంలోకి రాకుండా ఆర్బిట్లోనే ఉండిపోవచ్చు. అప్పుడు 96 గంటలకు మాత్రమే సరిపడా ఆక్సిజన్ ఉన్నందున వ్యోమగాముల ప్రాణాలకు ప్రమాదం జరగొచ్చు.

భూవాతావరణంలోకి ప్రవేశించడంలో విఫలం కావడం

ఈ ప్రమాదం కూడా లేకపోలేదన్నది రిడాల్ఫీ హెచ్చరిక. ముందే చెప్పుకున్నట్టు ఒక వేళ సరైన యాంగిల్లో కాప్సూల్ అతుక్కోకపోతే.. భూమి పైకి దిగ లేక నిరవధికంగా అంతరిక్షంలోనే అది ఉండిపోయే ప్రమాదం ఉంది.

మాడి మసైపోవచ్చు!

తిరిగొచ్చే సమయంలో తలెత్తే మరో ప్రమాదం ఏంటంటే వేపరైజేషన్. ఇది అత్యంత భయానకమైన పరిస్థితి. ఒక వేళ స్పేస్ క్రాఫ్ట్ నిట్టనిలువుగా కిందకు దిగే పరిస్థితే తలెత్తితే దానివల్ల పుట్టే రాపిడి వల్ల తలెత్తే వేడికి స్పేస్ క్రాఫ్ట్ హీట్ షీల్డ్ కూడా తట్టుకోలేకపోవచ్చు. అదే జరిగితే స్పేస్ క్రాఫ్ట్ భూమికి చేరే ముందే పేలిపోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే వ్యోమగాముల ప్రాణాలకే ముప్పు తప్పదు. మరోవైపు ఇప్పటికే సునితా విలియమ్స్ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని, కంటి చూపు కూడా దెబ్బతిన్నదన్న వార్తలు కూడా వస్తున్నాయి.

నాసా ఏమంటోంది?
ప్రస్తుతం నాసాపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. ఆస్ట్రోనాట్స్ భవిష్యత్తుపై ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్న ఈ పరిస్థితుల్లో తాజాగా ఆగస్టు 20న నాసా వారి భవిష్యత్ కార్యాచరణపై, అలాగే వ్యోమగాముల ఆరోగ్య పరిస్థితిపై ఓ సుదీర్ఘ నోట్ విడుదల చేసింది. ఫ్యాక్ట్స్ అబౌట్ నాసా బోయింగ్ క్రూస్ ఫ్లైట్ టెస్ట్ రిటర్న్ స్టేటస్ అంటూ అందులో చాలా విషయాలపై స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నించింది.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం…TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Sunitha Williams

అత్యవసర పరిస్థితుల్లో ఏం చేస్తారు?

ఒక వేళ అత్యవసర పరిస్థితి తలెత్తితే విల్ మోర్-సునీతా ఎలా తిరిగి భూమికి వస్తారన్న ప్రశ్నకు సమాధానిస్తూ ఒక వేళ అదే పరిస్థితి తలెత్తితే వెంటనే వారు స్పేస్ స్టేషన్‌నుంచి స్టార్ లైనర్లోనే బయల్దేరతారని తేల్చి చెప్పింది. అయితే ఇప్పటికిప్పుడు వారిద్దర్నీ భూమికి తీసుకురావాల్సినంత ఎమర్జెన్సీ ఏం లేదని స్పష్టం చేసింది. అంతే కాదు వారిని తిరిగి భూమికి తీసుకొచ్చేలోగా అంతరిక్ష నౌకలో తలెత్తిన సాంకేతిక సమస్యల్ని అర్థం చేసుకునేందుకు వారి సేవల్ని వినియోగిస్తోందని కూడా చెప్పింది.

స్టార్ లైనర్లో తిరిగి రాకపోతే వాళ్లిద్దరూ ఇంకెంతకాలం స్పేస్‌ స్టేషన్లో ఉంటారు?

ఒక వేళ వాళ్లిద్దరూ లేకుండానే స్టార్ లైనర్‌ను భూమికి తిరిగి తీసుకొనిరావాలని నాసా నిర్ణయించినట్టయితే సునీత-విల్ మోర్ ఇద్దరూ 2025 ఫిబ్రవరి చివరి వారం వరకు అక్కడే ఉండాల్సి వస్తుంది. అప్పుడు రానున్న సెప్టెంబర్లో స్పేస్ క్రూ 9 మిషన్‌ను పంపించేందుకు ప్లాన్ చేస్తామని నాసా తన నోట్‌లో వెల్లడించింది.. అప్పుడు నలుగురితో వెళ్లాల్సిన ఆ స్పేస్ క్రాఫ్ట్‌ను ఇద్దరితోనే పంపిస్తామని… సో.. సునీత-విల్ మోర్ ఇద్దరూ క్రూ 9 మిషన్‌లో రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది భూమికి వస్తారని స్పష్టం చేసింది.

అంటే వాళ్లిద్దరూ 2025 వరకు ఉండాల్సిందేనా?

ఇప్పటి వరకు ఆ విషయంలో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. స్టార్ లైనర్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను ఎప్పటకప్పుడు అంచనా వేస్తూ అన్ని రకాల ప్రత్యమ్నాయాలను పరిశీలిస్తుంటుంది. అన్నీ అనుకూలంగా ఉంటే వాళ్లు తిరిగి స్టార్ లైనర్లోనే వస్తారు. లేదంటే వచ్చే ఏడాది స్పేస్ ఎక్స్ క్రూ -9 మిషన్‌ ద్వారా తిరిగి భూమికి వస్తారు.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం…TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

ఆస్ట్రోనాట్స్ లేకుండా స్టార్ లైనర్ ప్రయాణం చెయ్యగలదా?

కచ్చితంగా… ఒక వేళ నాసా అలాంటి నిర్ణయమే తీసుకుంటే స్టార్ లైనర్ తనకు తానుగానే అన్ డాక్ కాగలదు.

నాసా, స్పేస్ ఎక్స్ కలిసి సునీత, విల్ మోర్‌లను కిందకు తీసుకురాగలవా?

ముందే చెప్పుకున్నట్టు నాసా అలాంటి నిర్ణయమే తీసుకుంటే స్పెస్ ఎక్స్ క్రూ 9ను వచ్చే సెప్టెంబర్లో నలుగురితో బదులుగా కేవలం ఇద్దరితో మాత్రమే అంతరిక్షంలోకి లాంచ్ చేస్తుంది. సో.. అదే స్పేస్ క్రాఫ్ట్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో సునీత, విల్ మోర్ ఇద్దరూ భూమికి చేరుకోవచ్చు.

3టన్నుల ఆహారం తీసుకెళ్లిన వ్యోమనౌక

ఇప్పట్లో రాకపోవచ్చు సరే… వాళ్ల అవసరాల పరిస్థితేంటి?(ఆహారం, నీళ్లు, బట్టలు, ఆక్సిజన్…?)

స్పేస్ స్టేషన్లో ఉన్న వాళ్లకు ఆహారం, నీళ్లు, బట్టలు, ఆక్సిజన్ ఇలాంటి అవసరాల గురించి ఏ మాత్రం చింతించాల్సిన పని లేదు. అందులో ఉన్న వారికి సరిపడా అన్నీ అంతరిక్ష కేంద్రంలో ఉంటాయి. అలాగే వారి అవసరాల మేరకు నాసా అలాగే నాసా పాట్నర్స్ ఎప్పటికప్పుడు భూమి నుంచి వాటిని పంపిస్తుంటారు కూడా. తాజాగా 3 టన్నుల ఆహారం, ఇంధనంతో పాటు మిగిలిన వస్తువుల్ని భూమి నుంచి అంతరిక్ష కేంద్రానికి పంపారు. ఆ స్పేస్ క్రాఫ్ట్ క్షేమంగా ఐఎస్ఎస్‌తో డాక్ అయినట్టు ఆగస్టు 17న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ X ప్లాట్ ఫాంలో పేర్కొంది(https://x.com/Space_Station/status/1824690252377989561). అలాగే అవసరమైతే ఈ ఏడాది చివర్లో మరోసారి ఆహారం, నీళ్లు, ఇంధనం, ఆక్సిజన్‌ తదితర వస్తువుల్ని స్పేస్‌ స్టేషన్‌కు పంపించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు నాసా వెల్లడించింది.

కుటుంబ సభ్యులతో మాట్లాడగలరా?

సునీతా, విల్ మోర్ ఇద్దరూ భూమ్మీద ఎలాంటి కంఫర్ట్స్ ఎంజాయ్ చేశారో దాదాపుగా అవే కంఫర్ట్స్ అక్కడ కూడా ఎంజాయ్ చేస్తున్నారన్నది నాసా చెబుతున్న మాట. వాళ్ల ఖాళీ సమయాల్లో ఈమెయిల్స్ చెయ్యగలరు. ఫోన్ చేసి మాట్లాడగలరు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లోల పాల్గొనగలరు. ఇదే విషయాన్ని ఇస్రో చీఫ్ సోమనాథన్ కూడా ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు.  సునీత కుటుంబ సభ్యులు చెప్పినట్టు ఆమె భూమ్మీద కన్నా అంతరిక్ష పరిస్థితుల్నే ఎంజాయ్ చేస్తుందన్న మాటల్ని ఆయన ప్రస్తావించారు. వారి క్షేమ సమాచారం విషయంలో నాసా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందన్నది ఆయన మాట.

అన్నీ సరే మరి తిరిగొచ్చే ప్లాన్ ఏంటి?

ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ తీసుకొచ్చేందుకు ప్రస్తుతం ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోంది. పరిస్థితులు అనుకూలంగా మారి స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తొలగిపోతే అందులోనే వస్తారు .లేదంటే స్పేస్ ఎక్స్ క్రూ -9లో 2025 ఫిబ్రవరిలో తిరిగి భూమికి రావచ్చు.

స్పేస్ ఎక్స్‌ ద్వారా భూమికి తీసుకురావడం సురక్షితమేనా?

రిస్క్ లేదని చెప్పలేం. అయితే ఎంత రిస్క్ ఉంటుంది..? దాన్ని ఎలా ఫేస్ చెయ్యాలి..? ఇవన్నీ ఆలోచించి, వాటికి తగిన పరిష్కారాలను కనుగొన్న తర్వాతే స్పేస్ ఎక్స్‌ను ప్రత్యమ్నాయంగా ఎంచుకుంటారు.

శనివారం రాత్రి నాసా లీడర్ షిప్ టెస్ట్ ఫ్లైట్ రెడీనెస్ రివ్యూ నిర్వహించనుంది. అనంతరం భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు ఓ ప్రెస్ కాన్పెరెన్స్ నిర్వహించి మరిన్ని అప్ డేట్స్ అందించనుంది.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం…TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి