Apple: ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. వచ్చే వారం నుంచే అందుబాటులోకి 5జీ సేవలు..

|

Nov 03, 2022 | 7:31 AM

దేశంలో ఇప్పుడిప్పుడే 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు మెట్రో నగరాల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు సైతం పెద్ద ఎత్తున 5జీ ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. అయితే 5జీ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ కొన్ని...

Apple: ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌.. వచ్చే వారం నుంచే అందుబాటులోకి 5జీ సేవలు..
Apple Iphone Update
Follow us on

దేశంలో ఇప్పుడిప్పుడే 5జీ సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు మెట్రో నగరాల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇక స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీలు సైతం పెద్ద ఎత్తున 5జీ ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. అయితే 5జీ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చినా ఇప్పటికీ కొన్ని కంపెనీలు 5జీ సేవలకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను మాత్రం అప్‌డేట్ చేయలేవు. ఇప్పుడిప్పుడే ఈ దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం యాపిల్‌ ఐఫోన్‌లలో 5జీని సపోర్ట్‌ చేసే తమ ఐఫోన్లకు వచ్చేవారం సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ ఇవ్వనున్నామని ప్రకటించింది.

ఇదిలా ఉంటే టెస్టింగ్‌లో భాగంగా తొలుత ఐఎస్‌ 16 బెటా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ వెర్షన్‌ను తీసుకురానున్నారు. ఎయిర్‌టెల్‌, జియో కస్టమర్స్‌కి 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఐఫోన్‌14, ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 12, ఐఫోన్‌ ఎస్‌ఈ (థార్డ్‌ జనరేషన్‌) ఫోన్‌లలో 5జీ సేవలకు సంబంధించిన అప్‌డేట్‌ను ఇవ్వనున్నారు. ఐఫోన్‌లలో 5జీ సేవలు ఎలా ఉన్నాయన్నదానిపై వినియోగదారులు ఫీడ్‌బ్యాక్ తెలియజేయాలని తెలిపారు. ఈ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ పూర్తిగా ఉచితమని యాపిల్‌ తెలిపింది.

అనంతరం డిసెంబర్‌లో తుది అప్‌డేట్‌ను వినియోగదారులందరికీ అందజేస్తామని యాపిల్ పేర్కొంది. ఈ మేరకు బుధవారం కేంద్ర ఐటీ శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో యాపిల్ తెలిపింది. ఇదిలా ఉంటే ఇతర మొబైల్‌ తయారీ సంస్థలు సైతం నవంబరు మధ్యలోనే 5జీ నెట్‌వర్క్‌కి అవసరమైన బీటా లేదా తుది సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ను అందజేస్తామని తెలిపాయి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే దేశంలో అక్టోబర్‌ 1వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ 5జీ సేవలను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ సహా మరో 12 నగరాల్లో ఈ సేవలు తొలుత అందుబాటులోకి వచ్చాయి. ఇక 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన నెల రోజుల్లోనే ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. భారతీ ఎయిర్‌టెల్‌ 10 లక్షల మైలురాయిని చేరుకోవడం విశేషం. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, సిలిగుడి, నాగ్‌పూర్‌, వారణాసి నగరాల్లో 5జీ ప్లస్‌ పేరుతో ఎయిర్‌టెల్‌ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..