గత రెండేళ్లుగా ఐఫోన్లలో పెద్దగా చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ లేదు. ఆపిల్ ఫోన్లలో డిజైన్ మార్పులు జరుగుతున్నా సాఫ్ట్‌వేర్‌లో మాత్రం పెద్దగా మార్పులు కనిపించలేదు. అయితే ఈ మధ్యనే సామ్సంగ్ s24 తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టెక్నాలజీని మొబైల్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. లైవ్ ట్రాన్స్క్రిప్షన్, ఏఐ అసిస్టెంట్ ఇలా కొన్ని ఫీచర్స్‌ని ఇంట్రడ్యూస్ చేసింది. ఇటు ఆపిల్ కూడా వచ్చే ఐ.ఓ.ఎస్18లో ఈ ఫీచర్స్‌ని తీసుకురానుంది.
అంతేకాదు మొదటిసారిగా పూర్తిస్థాయి ఆపిల్ ఇంటర్ఫేస్ని కూడా మార్చనుంది కంపెనీ. గతంలో ఐఫోన్ యూజర్స్‌కి ఎప్పుడు లేని ఎక్స్పీరియన్స్ ఈ కొత్త అప్డేట్తో రానుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మెయిల్, నోట్స్ నుంచి ఆప్స్ ఐకాన్స్ వరకు అన్నీ మారనున్నాయట. ఆపిల్ మాప్స్ గూగుల్ మ్యాప్స్‌తో పోలిస్తే పెద్దగా ఆదరణ లేదు. దీన్ని అధిగమించడానికి ఆపిల్ కూడా మ్యాప్స్‌లో చాలా మార్పులు తీసుకొస్తుందట. పర్సనల్ రూట్స్, ఫ్లెక్సిబుల్ నావిగేషన్ లాంటి కొత్త ఆప్షన్స్‌తో ఆపిల్ మ్యాప్స్ రానుంది. స్ట్రీట్ వ్యూ ఫ్యూచర్ ని కూడా ఇంకా బ్రైట్‌గా డెవలప్ చేయబోతుంది ఆపిల్.
మొదటిసారిగా ఆపిల్ కొత్త హోమ్ స్క్రీన్‌ను ప్రవేశపెడుతుంది. ఇంతకుముందు అప్లికేషన్ ఐకాన్స్‌ని మార్చుకునే అవకాశం లేదు. కానీ ఇప్పుడు ఐకాన్ మార్చుకునే సదుపాయం అందుబాటులోకి తీసుకొస్తుంది. యూజర్ ఫ్రెండ్లీ హోం స్క్రీన్‌ని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఆపిల్ ఐవోఎస్18 తో ఫోన్ రుపు రేఖలే మారన్నాయట.
ఇక రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ అనే కొత్త సదుపాయాన్ని కూడా ఐఏఎస్ 18తో తీసుకొస్తున్నట్లుగా కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ RCS తో మెసేజ్‌లకు ఆటోమేటిక్‌గా రిప్లై ఇవ్వచ్చు. మెయిల్స్‌కి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సదుపాయంతో రిప్లై ఇచ్చే ఛాన్స్ ఉంది. స్టాండర్డ్ మెసేజ్‌లను అది చదివి వినిపిస్తుంది. మనం చదివే రిప్లైని టైప్ చేసి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా కంపోజ్ చేస్తుంది. అయితే ఈ సదుపాయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
అయితే ఐఓఎస్18 అన్ని మొబైల్స్‌లోనూ అప్డేట్ అవ్వదు. కేవలం 20 మోడల్స్‌లో మాత్రమే అప్డేట్ చేయనుంది ఆపిల్. ఇక మిగతా మోడల్స్‌లో ఐఓఎస్ 17 ఇక లాస్ట్ అప్డేట్. ఆ తర్వాత ఆ ఫోన్ లోకి సాఫ్ట్వేర్ అప్డేట్ ఉండదు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..